Advertisement
శబరిమల అయ్యప్ప స్వామికి చాలా మంది భక్తులు ఉన్నారు. ఆయన భక్తులు మాత్రమే కాదు ఆయనను స్మరించుకునే వారు కూడా చాలా నిష్టగా ఉంటారు. చివరకు ఆయన ఆలయానికి వెళ్ళడానికి నిష్టగా ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుంది. దీక్ష తీసుకుని నిష్టగా నియమాలను పాటించి అయ్యప్ప మాల ధారణను చేసేవారు కూడా చాలా మందే ఉంటారు. వీరంతా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామి దర్శనం కోసం చాలానే కష్టపడతారు. అయితే.. మీరెప్పుడైనా గమనించారా? అయ్యప్ప స్వామి రూపానికి మోకాళ్ళ బంధనం ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?
Advertisement
దీని వెనుక ఓ కథనం ఉంది. అయ్యప్ప స్వామి తన చిన్నతనంలో పండలరాజు వద్ద పన్నెండేళ్ల పాటు పెరుగుతారు. తరువాత ఆయన హరిహర సుతుడు అని తెలుస్తుంది. అంటే.. శివుడికి, విష్ణువుకి ఆయన కుమారుడు. ధర్మం సాధించడం కోసమే తాను జన్మించాను అని నారద మహర్షి ద్వారా తెలుసుకుంటారు. ఆ తరువాత ఆయన అయ్యప్పస్వామిగా మారుతారు. ఆయన శబరిమల ఆలయంలో జ్ఞానపీఠంపై ఎక్కి కూర్చుంటారు.
Advertisement
పద్దెనిమిది మెట్లు ఎక్కి జ్ఞానపీఠంపై అయ్యప్పస్వామి ఆసీనుడు అయినప్పుడు పండలరాజు ఆయన కోసం వస్తాడు. కింద ఉన్న పద్దెనిమిది మెట్లు ఎక్కి ఆయన స్వామి వద్దకు వచ్చేలోపు అయ్యప్ప స్వామి లేచి నుంచోవాలని అనుకుంటారు. ఈ ప్రయత్నంలో ఆయన పట్టు తప్పి పడిపోతారు. అయితే.. స్వామి వారు పడిపోకుండా.. కూర్చోడానికి అనుకూలంగా ఉండడం కోసం కాళ్లకు పట్టు పట్టీని కడతారు. ఈ పట్టీ ఎప్పుడు ఇలానే ఉండాలని పండలరాజు కోరతాడు. స్వామి వారు కూడా అలాగే ఉంటుంది అని పండలరాజుకి వరం ఇస్తాడు. అప్పటి నుంచి ఆ పట్టీ అలానే ఉంటూ వచ్చింది.
మరిన్ని..
“పుష్ప” సినిమాలో ఈ డైలాగ్ ను వేణుమాధవ్ ముందే చెప్పారా? వైరల్ అవుతున్న వీడియో!
ప్రపంచ మొట్ట మొదటి ఏటీఎం గురించి ఈ విషయాలు తెలుసా?
విజయ్ మాల్యా తండ్రి విట్టల్ మాల్యా గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవుతారు? అస్సలు ఊహించి ఉండరు!