Advertisement
బాలినేని శ్రీనివాస్ రెడ్డి వైసీపీని ఎందుకు విడిచిపెట్టారు..? గుర్తింపు లేదనా లేదంటే పార్టీలో తన ప్రత్యర్థులకు ప్రాధాన్యం ఇస్తున్నారనా..? అసలు ఏంటి కారణం..? జగన్ తో బంధం తెంచుకోవడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు..? ఏపీ పొలిటికల్ సర్కిల్ లో ఇది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. పార్టీ ఆవిర్భావం నుంచి తన వెంట అడుగులు వేయడంతో జగన్ కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్లో చోటిచ్చారు. ప్రకాశం జిల్లాలో తన మాట చెల్లుబాటు కోసమే ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది. వైసీపీతో పాటు అనుకూల మీడియాలో వేరే చర్చ నడుస్తోంది జగన్ సర్కారులో బాలినేని విద్యుత్ శాఖను నిర్వర్తించారు. అప్పట్లో చాలా దూకుడుగా ఉన్నారు.
Advertisement
Advertisement
ఏకంగా చార్టెడ్ ఫ్లైట్లో ప్రయాణం చేసేవారు. మింగుడు పడని జగన్ మంత్రి పదవి నుంచి బాలినేని తప్పించారని టాక్ వచ్చింది. ఇది జగన్ కి నచ్చలేదని ఇలా వదిలేస్తే బాలినేని ఎంతవరకైనా వెళ్లొచ్చని భావించి మంత్రి పదవి నుంచి తొలగించినట్లు అనుమానాలు ఉన్నాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి జగన్ కోసం గొప్పగా ఊహించుకున్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే తనకు తిరుగులేదు అనుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగే రాయలసీమ బాధ్యతలు అప్పగించినట్లు ప్రకాశం తో పాటుగా కోస్తాంధ్ర బాధ్యతలు అప్పగిస్తారని అనుకున్నారు. కానీ జరగలేదు.
Also read:
ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ ని కొనసాగించి తనను తప్పించడం బాలినేనికే బాధ కలిగించింది. బాలినేని ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి సొంత కొంత సొమ్ము వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారట. అయితే ఒప్పందం ప్రకారం డబ్బు మొత్తం ఇవ్వకపోవడం పెండింగ్లో ఉండడం ఇవ్వాల్సిన సొమ్ము కోసం అడుగుతుండడంతో రచ్చ నడిచినట్లు తెలుస్తోంది. ఆ డబ్బు ఇప్పించాలని జగన్ పై ఒత్తిడి తెస్తున్నట్లు కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!