Advertisement
గత కొన్ని రోజుల నుండి కూడా అంబానీ ఫ్యామిలీ మొత్తం వార్తల్లోనే ఉంటోంది. ఈ వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అందుకు కారణం అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ల పెళ్లి వీళ్లిద్దరూ జూలై 12న పెళ్లి చేసుకోబోతున్నారు. అంతకంటే ముందు ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో అదరగొట్టారు మార్చి ఒకటి నుండి మొత్తం మూడు రోజులు జాంనగర్లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగాయి ఈ వేడుకలు కంటే ముందే 51 వేల మంది స్థానికులు కి అన్న సేవ కూడా చేయడం జరిగింది. ఈ పెళ్ళికి సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి అతిథుల విషయంలో కూడా స్పష్టంగా కనిపించింది ప్రీ వెడ్డింగ్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది అతిథులు వచ్చారు. టాలీవుడ్ నుండి కేవలం రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందింది. అందుకు కారణం ఏంటి..?
Advertisement
Advertisement
ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెలెబ్రెటీలు అలనే స్టార్లు ఈ వేడుకకి హాజరయ్యారు ఆడుతూ పాడుతూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. క్రికెటర్లు అలానే బిజినెస్ టైకూన్స్ వరల్డ్ ఫేమస్ సింగర్స్ కూడా ఇన్విటేషన్ రావడంతో వెళ్లారు. టాలీవుడ్ నుండి రామ్ చరణ్ కి మాత్రమే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు ఆహ్వానం వచ్చింది చెర్రీ దంపతులు మాత్రమే టాలీవుడ్ నుండి ఆ వేడుకల్లో మెరిశారు. ఇప్పుడు ఎందుకు కేవలం చరణ్ కి మాత్రమే ఆహ్వానం దక్కింది అనేది ప్రశ్న హాట్ టాపిక్ అయింది.
రామ్ చరణ్ కి మాత్రమే ఆహ్వానం అందలేదు మొత్తం టాలీవుడ్ కి దక్కిన గౌరవం ఇది. టాలీవుడ్ కి ప్రాధాన్యతను ఇస్తూ చరణ్ కి ఇన్విటేషన్ పంపారు అంబానీ ఫ్యామిలీ అన్ని రంగాల నుండి టాప్ సెలబ్రిటీలకి ఆహ్వానాన్ని పంపించారు. టాలీవుడ్ ని గౌరవిస్తూ అంబానీ రాంచరణ్ కి ఇన్విటేషన్ పంపించారు. వాళ్లకి మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీకి దక్కిన గౌరవంగా దీన్ని భావించాలి. మూడు రోజుల్లో ఏకంగా 2,500 వంటకాలు అతిథులకి వండించి పెట్టారు జాంనగర్ లో ఫైవ్ స్టార్ హోటల్స్ లేకపోవడంతో వచ్చిన సెలబ్రిటీల కోసం ఫైవ్ స్టార్ హోటల్ కి మించిన సౌకర్యాలతో ఏర్పాటు చేశారు.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!