Advertisement
చికెన్ పాక్స్ పిల్లల్లో వచ్చే వ్యాధి. దీన్ని ఆటలమ్మ, అమ్మవారు పోసింది అని కూడా అంటారు. ఇది ఆటలాడే పిల్లల్లో కనిపిస్తుంది. సాధారణంగా చికెన్ పాక్స్ దానంతట అదే తగ్గిపోతుంది. కానీ అరుదుగా దుష్ప్రభావాలను తెస్తుంది. ఇది 2 నుంచి 8 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వరిసెల్ల జోస్టర్ అనే వైరస్ వల్ల చికెన్ ఫాక్స్ వస్తుంది. ఇది అంటు వ్యాధుల్లో ఒకటి. మొదట ఒకసారి వచ్చినా, లేదా వ్యాక్సిన్ తీసుకున్న, మరోసారి ఇది రావడం చాలా తక్కువ. అసలు చికెన్ పాక్స్ వస్తే, అమ్మవారు వచ్చింది అని ఎందుకు అంటారో ఇప్పుడు చూద్దాం.
Advertisement
పూర్వం జ్వరసుర అనే ఓ రాక్షసుడు ఉండేవాడట. చిన్నపిల్లలు తీవ్ర విష జ్వరాన్ని కలిగించేవాడట. ప్రజలకు ఏమీ అర్థం కాలేదు. చిన్నారులు మాత్రం చాలా అవస్థలు పడేవారు. వారంతా తమ పిల్లలను కాపాడాలంటూ దుర్గాదేవిని ప్రార్థించడం ప్రారంభించారట. అప్పుడు అమ్మవారు స్వయంగా పిల్లల శరీరంలోకి ప్రవేశించింది. అలా వచ్చినప్పుడే శరీరంపై ఎరుపు రంగులో దద్దుర్లు వచ్చి చర్మం పొంగినట్లు అయింది.
Advertisement
Also Read: నందమూరి హీరోలకు పాప సెంటిమెంట్ కలిసొస్తుందా..?
అప్పటినుంచి శరీరంపై ఇలా వచ్చినప్పుడు శరీరంలో పేర్కొన్న దుష్టశక్తిని అమ్మవారు స్వయంగా పోగోడుతారని విశ్వసించడం ప్రారంభించారట. అమ్మవారు స్వయంగా రోగాన్ని నయం చేస్తుందని, దానికి ఎలాంటి మందులు అవసరం లేదని ప్రజలు విశ్వసిస్తారు. కొన్ని రోజులు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తిరిగి మామూలు అయిపోతారు. అందుకే చికెన్ పాక్స్ వచ్చినప్పుడల్లా అమ్మవారి పోసింది అని తల్లి వచ్చింది అని అంటుంటారు.
Also Read: పవన్, శ్రీజలే కాకుండా మెగా ఫ్యామిలీలో 2-3 పెళ్లిళ్లు చేసుకున్న వారు వీరే..?