Advertisement
క్రికెట్ అనేది అంతర్జాతీయ క్రీడ. ప్రపంచ దేశాల్లోనూ క్రికెట్ కు అభిమానులు చాలా మందే ఉన్నారు. ఇక అన్ని దేశాల మధ్య కాంపిటీషన్ గా వరల్డ్ కప్ ని పెడుతూ ఉంటారు. ప్రతి ఏడాది జరిగే ఈ పోటీలలో అన్ని దేశాల క్రికెట్ జట్లు పాల్గొంటాయి.
Advertisement
ప్రతి దేశం జట్టు తమ దేశాన్ని గుర్తుగా చూపే విధంగా వారికి నిర్ణయించిన రంగు జెర్సీ లను ధరిస్తూ ఉంటాయి. అలాగే, మన భారత జట్టు వరల్డ్ కప్ మ్యాచ్ సమయంలో బ్లూ కలర్ జెర్సీలను ధరిస్తుంది. ఇలా ప్రతి దేశానికీ వారి వారి జట్టుని గుర్తించే విధంగా రంగుల జెర్సీలు వినియోగిస్తారు.
కానీ, మీరెప్పుడైనా గమనించారా? టెస్ట్ మ్యాచ్ లు ఆడుతున్నప్పుడు మాత్రం క్రికెటర్స్ వైట్ దుస్తులను మాత్రమే ధరిస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా టెస్ట్ మ్యాచ్ అనేది కనీసం ఐదు రోజుల పాటు ఉంటుంది.
Advertisement
పైగా.. క్రికెట్ ఆడాలంటే ఆటగాళ్లు రోజంతా ఎండలోనే నిలబడి ఆడాల్సి ఉంటుంది. ప్రతి ఆటగాడు టెస్ట్ మ్యాచ్ అంటే ఐదు రోజుల పాటు ఎండలనే ఆడాలి. దీనితో వారు అలసటకి గురి అవుతారు. వారు ఆట ఆడే సమయంలో తెల్లని దుస్తులు వేసుకోవడం వలన ఎండ ఎక్కువగా గ్రహించకుండా తెలుపు రంగు రిఫ్లెక్ట్ చేసేస్తూ ఉంటుంది.
ఫలితంగా, ఆట ఆడే సమయంలో ఆటగాళ్లు కొంత కూల్ గా ఉండగలుగుతారు. అలాగే.. మైదానంలో ఎక్కువగా ఎర్రటి బంతిని ఉపయోగిస్తారు. వైట్ దుస్తులకు ఈ బంతి కాంట్రాస్ట్ గా ఉంటుంది. కాబట్టి తెల్లని దుస్తుల మధ్య ఈ బాల్ ఎటువైపు వెళ్తోందో క్లియర్ గా కనిపిస్తుంది.
అందుకే టెస్ట్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్లు ఎక్కువగా తెల్లని దుస్తులను మాత్రమే వేసుకుంటూ ఉంటారు.
- మరిన్ని Telugu news మరియు తెలుగు లో క్రీడా వార్తలు కోసం ఇవి చదవండి !