Advertisement
అలనాటి సావిత్రి గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. తెలుగులో మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. సావిత్రి అటు తమిళనాట ఎంజిఆర్, శివాజీ గణేష్ లాంటి స్టార్ నటులతో కలిసి నటించి ఎంతో గొప్ప పేరు సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమ పుట్టినిల్లు అయితే తమిళ చిత్ర పరిశ్రమ మెట్టినిల్లు అని సావిత్రి అనేవారు. బాలీవుడ్ లో సైతం ఆమె చెరగని ముద్రవేసింది. అప్పట్లో సావిత్రి కాల్ షీట్స్ కోసం స్టార్ హీరోలు ఎదురు చూసేవారంటే ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉండేదో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.
Advertisement
సావిత్రి జీవితం ఎంత గొప్పగా వెలిగిపోయిందో, చివరి రోజుల్లో అన్ని కష్టాలు అనుభవించారని ఇండస్ట్రీ టాక్. కానీ అందరూ అనుకున్నట్లు ఆమె చనిపోయే ముందు దుర్భరమైన జీవితం అనుభవించలేదని కుటుంబ సభ్యులు చెబుతారు. సావిత్రి కి సంబంధించి ఎన్నో ఆస్తులు ఆమె కూతురు విజయ చాముండేశ్వరి, కొడుకు సతీష్ కుమార్ లకు దక్కింది. ఇక సావిత్రి చనిపోయే నాటికి ఆమెకు సినీ ఇండస్ట్రీ వైపు నుంచి ఎలాంటి సహాయం కానీ సానుభూతి కానీ లభించలేదని ఫిలిం వర్గాల్లో టాక్. దీనికి గల కారణం సావిత్రి మొండి వైఖరి అంటారు.
Advertisement
తెలుగు ఇండస్ట్రీలో దిగ్గజ నటుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు సావిత్రికి ఎన్నోసార్లు ఆమె వ్యసనాలు మానివేయాలని, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సలహా ఇచ్చారట. కానీ ఆమె మాత్రం తన మొండి వైఖరితో వారి మాటలు వినకపోవడం వల్లనే చివరి రోజుల్లో పెద్దగా పట్టించుకోలేదని ఫిలిం వర్గాల్లో టాక్. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లు మాత్రమే కాదు, సహా నటీమణులు కూడా సావిత్రి కి తన వ్యసనాలు మానివేయాలని చెప్పి చూశారట, కానీ ఎవరి మాటలు వినకపోవడంతో చనిపోయే ముందు ఎవరూ రాలేదని, కనీసం చూడలేదని అంటారు.
read also : షారుక్ ఖాన్ ఆస్తుల విలువెంతో తెలుసా..?