Advertisement
ప్రతిరోజు మన అవసరాల కోసం షాపింగ్ మాల్ కెళ్లి ఎన్నో వస్తువులను షాపింగ్ చేస్తూనే ఉంటాం. ఇందులో కొంతమంది కైతే షాపింగ్ చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. చిన్న వస్తువుల నుంచి మొదలు అన్ని అవసరాలకు షాపింగ్ కి వెళ్తారు.
Advertisement
అందులో ఏ వస్తువైనా సరే అవసరం ఉన్నా లేకున్నా కొని పడేస్తూ ఉంటారు. షాపింగ్ చేసేటప్పుడు మనం పెద్దగా పట్టించుకోని ఈ ఒక్క చిన్న విషయాన్ని మనం తెలుసుకుందాం..? మీరు ఎప్పుడైనా షాపింగ్ చేసేటప్పుడు వాటికి ఉన్నటువంటి ప్రైస్ ట్యాగ్ గమనించారా. వాటిని ఎప్పుడైనా నిశితంగా గమనిస్తే అందులో చివరి సంఖ్య 99 లేదా 95 ఈ సంఖ్యతో మాత్రమే ముగిస్తూ ఉంటాయి.
చిన్న షాపింగ్ మాల్ నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఇలా ఎక్కడ చూసినా ఇలాంటి ఫార్ములా మాత్రం మనకు తారసపడుతుంది. మరి దీని వెనుక ఉన్న అసలు కథ ఏమిటి..? అయితే షాపింగ్ చేసేటప్పుడు జనాలు ఏ సంఖ్య అయినా రౌండ్ ఫిగర్ చేస్తే దానిపై ఎక్కువగా ఆసక్తి చూపరని, ఇలా 1,599,599, లేదంటే 99 ఉంచితే జనాలు చాలా ఆసక్తి చూపి షాపింగ్ చేస్తారని ఒక సర్వేలో తేలింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇలాంటి ఫార్ములానే వాడతారు. దీనిపై ఎన్నో రీసెర్చ్ లో జరిగాయి ఎంతోమంది మేధావులు దీనిపై స్టడీ చేసి ఒక కొత్త విషయాన్ని బయట పెట్టారు.
Advertisement
ఏదైనా వస్తువు కొనేటప్పుడు జనాలు స్టార్టింగ్ లో ఉండే ఆ రెండు నెంబర్లు చూసే కొనాలా వద్దా అనేది డిసైడ్ అయిపోతారట. ఒక ప్రైస్ ట్యాగ్ లో 1499, మరోక దాంట్లో1500 అనేది ఉంది. ఇది చూసిన 90% మంది 1499 ఉన్న దాని మీదే ఎక్కువ ఆసక్తి కనబరిచారట. ఇందులో రెండింటికీ ఉన్నటువంటి తేడా రూపాయి మాత్రమే. ఎందుకంటే మనం స్టార్టింగ్ లో ఉన్న రెండు నెంబర్స్ తప్ప ఎండింగ్ లో ఉన్న రెండింటినీ ఎప్పుడు పట్టించుకోం. అయితే ఇందులో చాలామంది ఇలాంటి ట్యాగులు చూసే షాపింగ్ చేస్తారని చాలామంది రీసెర్చి చేసి చెప్పారు.