Advertisement
డాక్టర్లని మనం చూసినట్లయితే, డాక్టర్లు తెల్ల కోట్ వేసుకుంటూ ఉంటారు. అలానే లాయర్లను చూసినప్పుడు లాయర్లు నల్ల కోట్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఎందుకు డాక్టర్లు తెల్ల కోట్ వేసుకోవాలి..? లాయర్లు నల్ల కోట్ ఎందుకు వేసుకుంటారు అనే దాని వెనుక కారణాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. హాస్పిటల్ కి వెళ్ళినప్పుడు తెల్ల కోటు వేసుకున్న వాళ్ళని డాక్టర్ అని మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అలానే డాక్టర్లు తెల్ల కోట్లు వేసుకోవడం వలన ఏదైనా మరక పడిన వెంటనే దానిని గమనించవచ్చు. వెంటనే దానిని క్లీన్ చేసుకుంటారు.
Advertisement
లేదంటే మరో కోట్ ని మార్చుకుంటారు. తెల్ల కోటు మీద స్పష్టంగా మరకలు కనబడతాయి. ఇన్ఫెక్షన్లు వెంటనే సోకకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. ఇక లాయర్ల విషయానికి వస్తే నలుపు రంగు డిగ్నిటీ, హానర్, విజ్ఞానాన్ని సూచిస్తుంది. అలానే న్యాయానికి కూడా సింబల్. అందుకని లాయర్లు నల్ల కోటు వేసుకుంటుంటారు. కోర్టుకు వెళ్ళినప్పుడు నల్ల కోటు వేసుకున్న వాళ్ళు లాయర్లు అని మనం గుర్తించడానికి కూడా బాగుంటుంది. ఈ కారణంగానే డాక్టర్లు తెల్లకోటు లాయర్లు నల్లకోటు వేసుకుంటారు.
Advertisement
న్యాయవాదులు, న్యాయమూర్తులు నల్లకోటు వేసుకోవడం వెనుక చరిత్ర వుంది. 1327లో ఎడ్వర్డ్- III న్యాయవాద వృత్తిని మొదలు పెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అప్పట్లో కోటు రంగు వంటివి లేవు. ఆ తరువాత 1637లో లాయర్ల కౌన్సిల్ లో న్యాయవాదులు బ్లాక్ కలర్ డ్రెస్ ధరించాలని సూచించారు. 1694లో బ్రిటన్ రాణి క్వీన్ మేరీ అనారోగ్యంతో చనిపోయారు.
ఆమె భర్త కింగ్ విలియమ్స్ న్యాయమూర్తులు, న్యాయవాదులంతా నల్ల గౌన్లు ధరించి కోర్టులో జరిగే సంతాప సభకు రావాలన్నారట. ఆ తరువాత నుండీ కూడ లాయర్లు నల్ల దుస్తులు ధరిచడం మొదలైంది. 1961 చట్టం ప్రకారం నల్ల కోటు తెల్లటి బ్యాండ్ టైని తప్పని సరి చేశారు.
Also read: