Advertisement
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు నట వారసునిగా అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని తెచ్చుకున్నారు నాగార్జున. తనదైన శైలిలో సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ యూత్ మరియు ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని దక్కించుకున్నారు. 60 ఏళ్ల వయసు వచ్చినప్పటికీ ఇంకా యంగ్ గా కనిపించడం విశేషం. ఇదిలా ఉంటే.. సినిమా కథలోనే కాకుండా సినిమాలో నటించే వాళ్లు ఎవరు ఎలాంటి కష్టాలలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరు కూడా పరస్పరం సహాయం చేసుకుంటూ ఉంటారు. అలా ఇప్పటివరకు ఎంతోమంది నటీనటులు సైతం సహాయం చేసుకొన్న సందర్భాలు ఉన్నాయి.
Advertisement
Read also: బీసీసీఐ ట్విటర్ ఖాతాకు గోల్డ్ కలర్ టిక్.. కోహ్లీకి ఎందుకు లేదో తెలుసా..?
Advertisement
ఎవరి ఇంట్లో ఎలాంటి కార్యక్రమాలు అయినా మరొకరు కుటుంబాలతో సహా వెళ్తారు. కానీ టాలీవుడ్ కింగ్ నాగార్జున మాత్రం అందుకు భిన్నంగా కనిపిస్తారు. ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా ఆయన చివరి చూపు చూడడానికి వెళ్ళరు. చాలా ఏళ్లుగా ఆయన ఇలాగే వ్యవహరిస్తున్నారు. దీనికి అసలు కారణం తెలియదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం ఈ న్యూస్ వైరల్ గా మారింది. ఇటీవల సూపర్ స్టార్ కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా నాగార్జున రాకపోవడంపై సోషల్ మీడియాతో పాటు మీడియాలో కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి. కానీ నాగార్జున దాసరి నారాయణరావు భార్య పద్మ చనిపోయిన మూడవరోజు వెళ్లి దాసరిని కలవడం జరిగింది.
కానీ ఆ సమయంలో నాగార్జునకి సంబంధించిన ఓ సినిమా ఆగిపోవడం వల్లనే ఆయన దాసరిని పరామర్శించారని చెప్పుకుంటున్నారు. ఈ ఒక్క విషయం మినహాయిస్తే పెళ్లిళ్లు, ఫంక్షన్స్ పార్టీలకు మాత్రం నాగార్జున షూటింగ్ లేకపోతే హాజరు అవుతారు. అక్కినేని కుటుంబంలో నాగేశ్వరరావు మరణించినా, ఆయన భార్య అన్నపూర్ణమ్మ మరణించినా చాలామంది వేళల్లో అభిమానులతో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం తరలి వెళ్ళింది. కానీ నాగర్జున ఎందుకు ఎవరు కన్ను మూసినా చివరి చూపుకు వెళ్లడం లేదనేది మాత్రం పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.
Read also: మీ వాహనానికి ఈ సిరీస్ నెంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడికెళ్లినా పోలీసులు టచ్ చేయరు?