Advertisement
ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి ఏదో సమయంలో మరణించక తప్పదు. మరణం అనేది ముందు వెనకైనా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరికి వస్తుంది. ఇక మరణించిన వారు తమ కుటుంబ సభ్యులకు ఎన్నో జ్ఞాపకాలను వదిలి వెళ్ళిపోతారు. అవి వారు ధరించే వస్తువులు కావచ్చు లేక బట్టలు కావచ్చు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. చనిపోయిన వ్యక్తి ఉపయోగించిన బట్టలను ధరిస్తూ ఉంటారు. ఇలా చనిపోయిన వ్యక్తి బట్టలు ఎందుకు చేయకూడదని కొన్ని పురాణాలు వెల్లడిస్తున్నాయి. ఆ బట్టలు ఎంత కొత్తగా, మోడ్రన్ గా ఉన్నా కూడా దుస్తులను ధరించకూడదు అని చెప్పడం వెనుక కారణం ఏమిటి.? దీని వెనుక ఆత్మ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణానికి సంబంధించిన ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా..? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ తన బట్టలు మరియు ఇతర ఇష్టమైన వస్తువుల ద్వారా తన కుటుంబాన్ని మరియు తన ఇంటిని గుర్తిస్తుంది. అందుకే, ఆ వస్తువులు దహనం చేయకపోయినా, దానం చేయకపోయినా, చనిపోయిన తర్వాత కూడా ఆ ఆత్మ తన కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని వదులుకోలేక అక్కడ తిరుగుతూనే ఉంటుంది. దీని వలన వారి జీవితం ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి పొందలేకపోతుంది.
Advertisement
సైన్స్ పరంగా చూస్తే.. చనిపోయిన వ్యక్తి బట్టలు లేదా ఇతర వస్తువులను ఉపయోగించడాన్ని కూడా శాస్త్రవేత్తలు నిషేధించారు. శాస్త్రవేత్తల ప్రకారం, ఒక వ్యక్తి మరణించినప్పుడు, అంతకు ముందు బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా అతను చాలా బలహీనంగా ఉంటాడు. కంటితో చూడలేని అనేక సూక్ష్మ బ్యాక్టీరియా మరియు వైరస్‌లు అతని శరీరంలోకి ప్రవేశించాయి. అటువంటి పరిస్థితిలో ఆ వ్యక్తి మరణించిన తర్వాత కూడా, ఆ బ్యాక్టీరియా బట్టలు మరియు ఇతర వస్తువులలో ఉంటుంది. దీంతో వీటిని ధరించే కుటుంబ సభ్యులకు ప్రాణాంతకమైన బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తుంది. దీనితో ఎవరైతే చనిపోయిన వ్యక్తి బట్టలు మరియు వస్తువులను ఉపయోగిస్తారో.. ఆ కుటుంబ సభ్యుడు రోగాల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి చనిపోయిన వ్యక్తి యొక్క బట్టలు తిరిగి ఉపయోగించకూడదనేది సైన్స్ పరంగా వ్యక్తం అవుతుంది..
ఇంకా మరో కోణంలో చూస్తే.. వ్యక్తి శరీరం విడిచి వెళ్లినప్పుడు అతడికి సంబంధించిన విషయాలను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనవుతున్నారని సైకాలజిస్టులు చెబుతున్నారు. చనిపోయిన వ్యక్తి బట్టలు, పెన్ను, మొబైల్ లేదా ఇతర వస్తువులను చూసినప్పుడల్లా వారి మానసికంగా కుంగిపోయే ప్రభావం ఎక్కువ ఉందని తెలియజేస్తున్నారు. దీని కారణంగా, ఆ వ్యక్తి లోపల మానసికంగా బలహీనంగా మారడం ప్రారంభిస్తాడు. ప్రతి క్షణం మరణించిన వ్యక్తిని గుర్తు చేసుకుంటాడు. ఆ జ్ఞాపకాలు అతన్ని జీవితంలో ముందుకు సాగనివ్వవు. అందుకే చనిపోయిన వ్యక్తి వస్తువులను దానం చేయాలి లేదా దహనం చేయాలి.
Also read:
ధన లక్ష్మి నిత్యం ఇంట్లో ఉండాలంటే ఏమి చేయాలి ? ఏమి పాటించాలి ?
సూర్యాస్తమయం తర్వాత వీటిని చూస్తే.. డబ్బుకి లోటు ఉండదు..!
Chanikya niti : వివాహమైన మహిళలు ఈ 5 విషయాలకు ఎప్పుడూ దూరంగా ఉండాలి..!