Advertisement
డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన అనేక పోషకాలు మనకి అందుతాయి. వాటిలో ఉండే పోషక ప్రయోజనాలు వలన ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. చాలా సమస్యలను నయం చేసుకోవచ్చు కూడా. డ్రైఫ్రూట్స్ చాలా మంచిదని తింటూ ఉంటారు. అయితే నానబెట్టి మాత్రమే వాటిని ఎందుకు తీసుకోవాలి..? దీని వెనక కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టడం వలన ఫైటిక్ యాసిడ్ యొక్క ఔటర్ లేయర్ తొలగిపోతుంది. ఐరన్, జింక్, క్యాల్షియం వంటి మినరల్స్ శరీరానికి అందుతాయి.
Advertisement
డ్రై ఫ్రూట్స్ ని నానబెట్టి తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. వీటిని నానబెట్టి తీసుకోవడం వలన జుట్టు ఊడిపోవడం తగ్గుతుంది. ఒత్తుగా బలంగా కూడా మారుతుంది. ఇందులో ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.
Advertisement
Also read:
ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే ప్రోటీన్, ఫైబర్ కూడా అందుతుంది. ఆకలి తక్కువ ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకోవడం వలన ప్రోటీన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి బాగా అందుతాయి. గుండె సమస్యలు రాకుండా ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం చూసినట్లయితే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ని తీసుకుంటే వాత, పిత్త, కఫ దోషాలు చేయడానికి సహాయపడతాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ నానబెట్టుకుని తీసుకోవడం వలన ఇన్ని లాభాలు ఉంటాయి.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!