Advertisement
జవహర్ లాల్ నెహ్రూ ముందు నుండి కూడా తన కూతురు ఇందిరా గాంధీ ఫిరోజ్ గాంధీల పెళ్లిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇందిరా ఫిరోజ్ ఇద్దరు కూడా లండన్ లో చదువుతున్నప్పుడు ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు నెహ్రూ మాత్రం వాళ్ళ పెళ్లికి అభ్యంతరం వ్యక్తం చేసేవారు.
Advertisement
అసలు వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేదు నెహ్రూ. అయినా కూడా ఇందిరా తండ్రి మాట అసలు వినలేదు. 1942లో ఇందిరా గాంధీ పార్శి మతానికి చెందిన ఫిరోజ్ గాంధీని పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లయిన ఒక ఏడాది తర్వాత వారి బంధం చెడిపోవడం మొదలుపెట్టింది. ఇందిరాగాంధీ భర్త ఫిరోజ్ ని విడిచిపెట్టి తన తండ్రి జవహర్లాల్ నెహ్రూ తో కలిసి జీవించడం మొదలుపెట్టింది.
ఫిరోజ్ గాంధీ లక్నోలో ఉండేవారు నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రిక లో పని చేసేవారు. ఫిరోజ్ గాంధీ ఇందిరా అతని నుండి దూరంగా జీవించడం మొదలుపెట్టింది. అతనికి చాలామంది మహిళలతో లింకు ఉందట. సీనియర్ జర్నలిస్ట్ కుమీ కపూర్ రాసిన పుస్తకంలో ఫిరోజ్ గాంధీ ఇందిరా గాంధీకి విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారని తర్వాత లక్నోలోని ఒక ముస్లిం మహిళని వివాహం చేసుకోవాలనుకున్నారని ఆ ముస్లిం అమ్మాయి చాలా అందంగా యవ్వనంగా ఉండేదని ఆ పుస్తకంలో ఉంది. ఈ విషయం ఫిరోజ్ మామ జవహర్లాల్ నెహ్రూ కి తెలిసింది దీంతో కోప్పడ్డారు.
Advertisement
ఇలా చేస్తే తమ కుటుంబం పరువు పోతుందని నెహ్రూ ఫిరోజ్ తో చెప్పారని ఆ పుస్తకంలో ఉంది. సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయి కూడా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పారు. ఫిరోజ్ ఎంతో బాగా మాట్లాడేవాడని అద్భుతమైన హాస్యం కలవాడట. దీంతో మహిళలు అతని వైపు ఆకర్షితులయ్యేవారట. నెహ్రూ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో అతనికి సంబంధం ఉందని పుకార్లు కూడా వచ్చాయి. ఉత్తర ప్రదేశ్ కి చెందిన సీనియర్ ముస్లిం మంత్రి కుమార్తెతో ఆయనకి సంబంధం ఉన్నట్లు కూడా అప్పట్లో చర్చనీయాంశంగా మారిందట.
ముస్లిం అమ్మాయితో ఫిరోజ్ గాంధీ కి సంబంధం ఉందని తెలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న రఫీ ని నెహ్రూ లక్నో కి పంపించారట. రఫీ అహ్మద్ కిద్వాయ్ ఆ ముస్లిం మంత్రికి అతని కూతురుకి ఫిరోజ్ కి నెహ్రూ మనసులోని మాటలు చెప్పారు. దీంతో సమస్య సాల్వ్ అయ్యింది. ఫిరోజ్ గాంధీ తన వ్యవహారాలని దాచి పెట్టాలని చూసేవారట కానీ అన్ని బయటపడేవట. 1955లో ఇందిరా గాంధీ మొదటిసారి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో సభ్యురాలుగా మారారు.
ఆ టైంలో ఫిరోజ్ గాంధీ పార్టీలోని అవినీతి అంశాన్ని లేవనెత్తారు. దీంతో వాళ్ళ బంధం మరింత క్షీణించింది. ఫిరోజ్ గాంధీ 1960లో చనిపోయారు ఆయన చనిపోయిన 15 ఏళ్ల తర్వాత ఫిరోజ్ చెప్పింది నిజమని నిరూపించబడింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!