Advertisement
ఏదైనా కొత్త వాహనాన్ని కొనుగోలు చేసినప్పుడు అది ద్విచక్ర వాహనమైనా.. నాలుగు చక్రాల వాహనమైన సరే నిమ్మకాయ కింద తొక్కిస్తూ ఉంటారు. ఎందుకు వాహనం కింద నిమ్మకాయ పెట్టి తొక్కించడం జరుగుతుంది..? దాని వెనక కారణం ఏంటి అనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. నిజానికి ఇది ఎప్పటి నుంచో వస్తున్న పద్దతి. కానీ ఇప్పటికి కూడా చాలా మంది దీనిని అనుసరిస్తున్నారు. పూర్వకాలంలో మనకి ఎడ్ల బండ్లు, గుర్రపు బండ్లు ఉండేవి. ఎడ్లు, గుర్రాలు అనేక ప్రదేశాల్లో నడుస్తూ ఉండేవి.
Advertisement
దారిలో రాళ్లు, రప్పలు, బురద ఇలా చాలా ఎదురవుతూ ఉంటాయి, వాటిని తట్టుకుంటూ ఇవి నడుస్తూ ఉంటాయి. అలా నడుస్తున్నప్పుడు కాళ్లకు ఏమైనా గుచ్చుకుని పుండ్లు పడతాయి. ఆ కాళ్ళ మీద బురద పడితే ఇన్ఫెక్షన్స్ అయ్యి పురుగులు వస్తాయి. పురుగులు పడినట్లయితే బండి సరిగా నడవదు. బండి బాగా నడవడం కోసం ఎడ్ల చేత గుర్రాల చేత నిమ్మకాయలని తొక్కించే వాళ్ళు.
Advertisement
Also read:
నిమ్మకాయల్లో ఉండే సిట్రిక్ యాసిడ్ పుండ్లలో ఉండే బ్యాక్టీరియాని చంపేస్తుంది. పూర్వకలం వాళ్లు వెళ్తూ వెళ్తూ బండిని నిమ్మకాయ పైకి ఎక్కించడం వెనుక కారణం ఇదే. ఈ పద్ధతిని చాలామంది ఇప్పటికీ పాటిస్తున్నారు. గుర్రపు బండ్లు, ఎడ్ల బండ్లు చేత అప్పట్లో పాటించే ఈ పద్దతిని ఇప్పుడు వాహనాల కింద నిమ్మకాయని రబ్బరు టైర్ల చేత తొక్కిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ పురాతన పద్ధతిని ఇంకా ఫాలో అవుతున్నారు. వాహనాల కింద నిమ్మకాయల్ని పెట్టి తొక్కించడం వెనక కారణమైతే ఇది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!