Advertisement
ప్రతి ఒక్కరు కూడా వారి ఆచార సంప్రదాయాన్ని పాటిస్తారు. పూర్వీకులు ఎలా అయితే ఆచరించారో అటువంటి సంప్రదాయాలని మనం పాటిస్తూ ఉంటాము. మనం పాటించే పద్ధతులని మన పిల్లలు పాటిస్తూ ఉంటారు. అందరి ఆచార సంప్రదాయాలు ఒకేలా ఉండవు ఒక్కొక్క కుటుంబానికి ఒక్కో విధంగా ఉంటాయి ఇది వరకైతే పెద్దలు కచ్చితంగా వాటిని పాటించేవారు కానీ ఈ రోజుల్లో చాలా మంది వాటిని పాటించడం లేదు. నిజానికి తాత తండ్రి పాటించే పద్ధతులు చాలా కఠినంగా ఉండేవి.
Advertisement
అందుకే ఈ తరం పాటించడం లేదు. మీరు గమనించినట్లయితే చాలామంది బ్రాహ్మణులు ఉల్లిని, వెల్లుల్లిని వంటల్లో వాడరు. చాలామంది బ్రాహ్మణులు మాంసాహారాన్ని మాత్రమే కాదు ఉల్లిపాయని వెల్లుల్లిపాయని కూడా తినరు. ఎందుకు బ్రాహ్మణులు ఉల్లిపాయని వెల్లుల్లిపాయని కూడా తీసుకోరు..? దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం..
Advertisement
అయితే ఇలా పాటించడం వెనుక కచ్చితంగా ఏదో ఒక పెద్ద కారణమే ఉంటుంది. ఊరికే ఇలాంటివి పాటించరు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయలో సల్ఫర్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ వాసనని ఇది ఇస్తుంది తింటే నాలుక మీద వాటి వాసన ఎక్కువసేపు ఉండిపోతుంది. మాట్లాడినా మంత్రాలు చదివిన వాసన వస్తూ ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలను సాత్విక ఆహారంగా భావించరు.
సాత్విక ఆహారాన్ని తప్ప మిగిలిన వాటిని బ్రాహ్మణులు ముట్టుకోరు. చాలామంది బ్రాహ్మణులు మంత్రోచ్ఛారణ వేద పారాయణలని వృత్తిగా తీసుకుంటారు స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉండాలి. అందుకని ఉల్లి వెల్లుల్లి తీసుకోరు. తమో రజో గుణాలు ఉండే వాటిని అందుకే బ్రాహ్మణులు తీసుకోరు. ఈ కారణంగానే చాలా మంది బ్రాహ్మణులు వారి ఆహారం లో ఉల్లి వెల్లుల్లి చేర్చుకోరు.
Also read:
చంద్రబాబు పై కోపంతో రాయుడు వైసీపీ లో చేరాడా..? అసలు ఏం జరిగింది..?
పెళ్ళై 29 ఏళ్ళు అయ్యింది.. ఆ కారణంతో.. ఇంత దారుణానికి.. అసలేం జరిగిందంటే..?