Advertisement
బాలకృష్ణ పెళ్ళికి ఆయన తండ్రి ఎన్టీఆర్ అన్న హరికృష్ణ హాజరు అవ్వలేదు. ఈ విషయం గురించి మీకు తెలుసా..? నందమూరి ఫ్యామిలీకి తెలుగు రాష్ట్రాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పుకోక్కర్లేదు. ఎన్టీఆర్ నుంచి బాలయ్య, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అలాగే నారా ఫ్యామిలీ, దగ్గుబాటి ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ నుండి ఫిలిం ఇండస్ట్రీని రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎన్టీఆర్ నట వారసత్వం నిలబెట్టిన హీరో బాలకృష్ణ. ఆయన గురించి, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. తను తండ్రి పెట్టిన టీడీపీ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డుని సాధించారు.
Advertisement
గతంలో అన్న హరికృష్ణ ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నుండి రీసెంట్ గా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని దక్కించుకున్నారు. సినిమాల్లో కూడా వరుసగా నాలుగు సినిమాలు తో హిట్స్ కొట్టి విజయాలను అందుకున్నారు. పెళ్లి అంటే దగ్గర బంధువులు, దూరం బంధువులు, స్నేహితులు ఇలా ప్రతి ఒక్కరితో కళకళ్ళాడిపొతుంది. షాకింగ్ విషయం ఏంటంటే నందమూరి నట వారసుడు బాలయ్య పెళ్లికి ఎన్టీఆర్ కానీ హరికృష్ణ కానీ రాలేదట. సొంత కొడుకు పెళ్లికి ఎన్టీఆర్ రాలేదు. సొంత తమ్ముడు అయ్యుండి హరికృష్ణ కూడా రాకపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా..? బాలయ్య ఏమైనా ప్రేమ పెళ్లి చేసుకున్నాడా, పెద్దల కుదిర్చిన పెళ్లి కదా చేసుకున్నారు.
Advertisement
Also read:
Also read:
రాకపోవడం ఏంటనే ఆలోచిస్తున్నారా..? బాలకృష్ణ వసుందర దేవిది పెద్దల కుదిర్చిన వివాహమే. 1982 డిసెంబర్ 8న వీళ్ళ పెళ్లి జరిగింది. అయితే సరిగ్గా పెళ్లి జరిగే సమయానికి ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్రలో ఉన్నారు. బాలయ్య పెళ్లి సమయానికి ఎన్టీఆర్ ప్రజా చైతన్య యాత్ర పేరుతో బిజీగా ఉన్నారు. యాత్రకు బ్రేక్ ఇవ్వడం కుదరక ఎన్టీఆర్ పెళ్లికి రాలేదు దాంతో ఎన్టీఆర్ లేకుండానే బాలయ్య పెళ్లి జరిగింది. ఈ ప్రజా చైతన్య యాత్రకు రథసారధిగా ఉన్న హరికృష్ణ కూడా ఈ కారణం తోనే పెళ్లికి రాలేదు. ఎన్టీఆర్ ప్రయాణం చేస్తున్న బండిని హరికృష్ణ నడిపారు. దాంతో హరికృష్ణ కూడా పెళ్ళికి రాలేదట పెళ్లి తర్వాత యాత్రలో ఉన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లి బాలయ్య ఆశీర్వాదాలు తీసుకున్నారు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!