Advertisement
నందమూరి తారక రామారావు తెలుగునాటు మహానటుడిగానే కాకుండా గొప్ప నాయకుడిగా కూడా ఎంతో కీర్తిప్రతిష్టలు అందుకున్నారు. ఒక వైపు సినిమాలలో రాణిస్తూనే తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా సేవకి సమర శంఖం పూరించారు. నాయకుడిగా గెలిచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి సీఎంగా కాకుండా తెలుగు వారి సేవకుడిగా ఎన్నో గొప్ప కార్యక్రమాలను అమలు చేశారు. నందమూరి తారక రామారావు గారు తన సొంత కుటుంబం కంటే ప్రజలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. 1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రచార కార్యక్రమాలలో చాలా ఎక్కువగా ఉండేవారు. పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలలో ప్రజాసేవకోసం కొంతమంది జర్నలిస్టుల సలహా కూడా తీసుకునేవారు.
Advertisement
ఇక అదే సమయానికి ఈనాడు పత్రిక వ్యవస్థాపకులు రామోజీరావు ఇప్పటికే బాగా పేరుగాంచిన వ్యక్తిగా ఉండేవారు. ఒక రోజు రామోజీరావు ఇంటికి వెళ్లారు ఎన్టీఆర్. పార్టీ కోసం ప్రజలు, ప్రచారాలు గురించి ఆయనతో ఎన్టీఆర్ చర్చిస్తున్న సమయంలో ఓ అమ్మాయి టీ తీసుకొని వచ్చింది. ఆ టీ తీసుకున్నా రామారావు ఆ అమ్మాయి ఎవరు అని రామోజీరావుని ప్రశ్నించారట. అప్పుడే ఆమె నా ప్రాణ స్నేహితుడు సూర్యరావుకు కుమార్తె అని చెప్పారట రామోజీరావు. ఇక అమ్మాయి ఎవరో కాదు.. ఆమె వసుంధరా దేవి.. అదే సమయంలో బాలయ్య పెళ్లి విషయంపై కూడా చర్చలు జరిగాయి. ఇంకా ఎవరో ఎందుకు మన బాలయ్యకు వసుంధర అయితే జోడిగా సరిపోతుందని నిర్మొహమాటం లేకుండా ఎన్టీఆర్ తో రామోజీరావు చెప్పేసారట.
ఎన్టీఆర్ కుటుంబంతో సంబంధం కావడంతో వెంటనే వచ్చిందిరా దేవి తండ్రి కూడా సంబంధానికి ఓకే చెప్పేసారట. ఇక వారంలోనే కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య బాలయ్యతో వసుంధర దేవి నిశ్చితార్థం జరిగిపోవటం, ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో 1982 డిసెంబర్ 8న బాలకృష్ణ మరియు వస్తుందిరా దేవి వివాహం జరిగింది. ఇక ఎవరికీ తెలియని విషయం ఏమిటంటే.. బాలకృష్ణ వివాహానికి ఆయన సోదరుడు హరికృష్ణ మరియు తండ్రి ఎన్టీఆర్ ఇద్దరు కూడా హాజరు కాలేదు.
Advertisement
బాలకృష్ణ పెళ్లి జరుగుతున్నా ఎన్టీఆర్ హాజరుకాకపోవడానికి గల కారణం..? అదే సమయంలో ప్రజా యాత్ర చేస్తున్న ప్రజల సమస్యలు తెలుసుకుంటూ రాష్ట్రమంతటా కాంపెయిన్ చేస్తున్న ఎన్టీఆర్ బాలకృష్ణ వివాహానికి హాజరు కాలేకపోయారు. ఇక బాలకృష్ణ పెళ్లి పెద్దగా రామోజీరావు వ్యవహరించడం జరిగిందట. తల్లి బసవతారకం మరియు కొంతమంది కుటుంబ సభ్యుల సమక్షంలో బాలకృష్ణ వసుంధర వివాహం జరిగింది. వసుంధర తండ్రి దేవరపల్లి సూర్యారావు అనేక బిజినెస్‌లతో సంపాదనలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. వస్తుందిరా దేవితో వివాహం జరిగే సమయానికి బాలకృష్ణ ఇంకా సోలో హీరోగా ఎంట్రీ ఇవ్వలేదు. అయినా కూడా బాలయ్యకు వసుంధర దేవి తండ్రి సూర్య రావు అప్పటలోనే లక్షలు కట్నం మరియు ఒక కారు కూడా ఇచ్చారట.
పెద్ద వ్యాపారవేత్త కుమార్తె అయినా కూడా వసుంధరా దేవి ఏ రోజు కూడా సినిమా ఫంక్షన్స్ కి కానీ, వేరే ఇతర కార్యక్రమాలకు గానీ ఆమె బయటకు వచ్చేవారు కాదు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈనాడు కలర్ పేపర్ గా మారిన తర్వాత రామోజీరావు సినిమా పత్రికను ప్రచురించడం మొదలుపెట్టారు. ఈనాడు సినిమా పత్రిక బాగా పాపులర్ కావడంతో మహిళలు కూడా ఈనాడు పేపర్ చదవాలి అనే ఉద్దేశంతో ఒక ఎడిషన్ ని ప్రారంభించాలని అనుకున్నారట. ఇంతకీ ఆ ఎడిషన్ కి ఏం పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉండగా తన సొంత కూతురు భావించే వసుంధర పేరు అయితే బాగుంటుందని అనుకున్నారట. అలా రామోజీరావు ఈనాడు దినపత్రికలో బాలకృష్ణ భార్య అయిన వసుంధరా దేవి పేరు మీద వసుంధర ఎడిషన్ ప్రారంభించారు.
Also read :
ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్ కాదు.. మరి ఏమిటో తెలుసా..?
Bedurulanka 2012 review in telugu : బెదురులంక 2012 హిట్టా..? ఫట్టా..?
GANDEEVADHARI ARJUNA REVIEW : “గాండీవధారి అర్జున” తో వరుణ్ తేజ్ మరొక హిట్ అందుకున్నాడా..?