Advertisement
ఎన్.టి.రామారావు, ఎన్టీఆర్ గా ప్రసిద్ధి చెందారు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఎన్నిక అయిన ఎన్టీఆర్ సినిమా హీరోగా కూడా పాపులర్ అయ్యిన సంగతి తెలిసిందే. నాటక రంగం నుంచి సినిమాల్లోకి.. ఆ తరువాత సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒకటి, రెండు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన కొన్ని సార్లు కొన్ని విషయాలను సడన్ గా అందరికి తెలిసేలా చేసి ఆశ్చర్య చకితుల్ని చేసేవారు. అలానే ఓ సారి ఆయన తిరుపతిలో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి కాషాయ రంగు దుస్తులలో దర్శనం ఇచ్చి ఆశ్చర్య పరిచారు.
Advertisement
ఇవి కూడా చదవండి: ఢిల్లీకి ఏపీ సిఐడి పోలీసులు… నారా లోకేష్ అరెస్టు ఖాయమేనా ?
దీనితో పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఫంక్షన్ కి అటెండ్ అయిన వారు అందరు షాక్ అయ్యారు. ఆయన ఎందుకు ఇలా ధరించారో అని అడగాలని అనుకున్నా అడగలేకపోయారు. చివరకు ఫంక్షన్ అయిపోయిన తరువాత మీడియా ఆయన వెంట వెళ్ళింది. అప్పట్లో ఎలక్ట్రానిక్ ప్రసారాలు, లైవ్ షో లు లేవు. ప్రింట్ మీడియా రిపోర్టర్లే విశేషాలను నోట్ చేసుకుని పేపర్ లో పబ్లిష్ చేసేవారు. వారంతా.. ఎన్టీఆర్ ను చుట్టుముట్టి ఇలాంటి దుస్తులు వేసుకోవడానికి కారణం ఏంటని అడిగారు.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రబాబు కి హైకోర్టు బెయిల్ ఎందుకు ఇవ్వలేదు..? అసలు కారణం ఇదే..!
ఆయన దానికి సమాధానంగా సన్యసికరణకు సంకేతంగా ఈ దుస్తులు ధరిస్తున్నానని తెలిపారు. ఇకపై వీటినే ధరిస్తానని.. ముక్కుపచ్చలారని పిల్లని చెరచడం అనేది నా మనసుని కలచివేసిందని.. జీవితంపైనే విరక్తి వచ్చేలా చేసిందని తెలిపారు. అందుకే ఇకపై ప్రాపంచిక సుఖాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని.. అందుకే ఈ కొత్త వేషధారణని ఎంచుకున్నానని ఎన్టీఆర్ తెలిపారు. రాజకీయంలో ఉండి సన్యసించడం ఎలా కుదురుతుంది అని ఓ విలేఖరి అడగగా..
ఇవి కూడా చదవండి: చంద్రబాబు అరెస్ట్ తరువాత పవన్ చేసిన అతి పేద్ద తప్పు ఇదేనా ?
ఆయన తనను తాను రాజయోగిగా పేర్కొన్నారు. తెల్లారేసరికి ఈ వార్త దేశమంతా వ్యాపించింది. ఆ సమయంలో కాంగ్రెస్ నేతలు ఆయనను డ్రామారావు అంటూ విమర్శించినప్పటికీ ఆయన లెక్క చేయలేదు. ఆయన ఇలాంటి దుస్తులు ధరించడానికి మరో కారణం స్వామి అగ్నివేశ్ అని చెబుతుంటారు. ఓ సారి హైదరాబాద్ కు స్వామి అగ్నివేశ్ వచ్చినప్పుడు..
ఎన్టీఆర్ ఆయనను కలిసి.. ఆ దుస్తుల గురించి అడిగారు. అప్పుడు ఆయన సన్యసిస్తే మనకి స్వార్ధం ఉండదు.. సమాజం కోసమే ఆలోచిస్తాం. మీరు నిజాయితీగా పని చేయాలనీ అనుకుంటే సన్యసించండి అని సలహా ఇచ్చారట. ఆయన సలహా మేరకే ఎన్టీఆర్ కాషాయ దుస్తులు ధరించారని అంటుంటారు.