Ads
పవన్ కళ్యాణ్ గత నాలుగు నెలలుగా రాజకీయాల మీద పూర్తి ఫోకస్ పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోతున్నారు. వారాహి యాత్ర ద్వారా అధికార పక్షాన్ని ముప్పు తిప్పలు పెడుతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ కి ఈసారి రాజకీయాల్లో తిరుగు ఉండదని అంతా భావిస్తున్నారు. వైసిపి పార్టీ తీసుకువచ్చిన వాలంటీర్ వ్యవస్థ పై ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారాయి. కానీ నిజానికి ఇటువంటి వ్యాఖ్యల వలన పార్టీకి జరిగే మంచి కంటే నష్టం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. అయినా కూడా పవన్ కళ్యాణ్ తగ్గకుండా దూసుకువెళ్లిపోతున్నాడు.
గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై అనుకూలంగానూ వ్యతిరేకంగానూ అనేక చర్చా కార్యక్రమాలు చోటుచేసుకున్నాయి. పవన్ వ్యాఖ్యలపై కోర్టుకు వెళ్లడానికి రెడీ అయింది వైసిపి సర్కార్. ప్రజలకి సేవ చేస్తున్న పెద్ద వ్యవస్థ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని.. వారి ఆత్మవిశ్వాసాన్ని పవన్ దెబ్బతీశారని ప్రభుత్వం కోర్టుకి వెళ్లబోతోంది. పవన్ కళ్యాణ్ మాత్రం కోర్టుకు వెళ్లినా అరెస్ట్ చేసినా కూడా వెనక్కి తగ్గనని ఆ మాట మీద నిలబడుతున్నారు.
Advertisement
మంగళగిరి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కూడా కేసులు పెట్టుకున్న వెనక్కి తగ్గనని పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రజలకు సంబంధించిన 23 రకాల విషయాలపై సమాచారం తీసుకుంటున్న వాలంటీర్ వ్యవస్థ వారికి తెలియకుండానే అక్రమాలకు ఊతమిచ్చినట్లు అవుతుందని… ఈ విషయంపై హోం మంత్రికి కూడా ఫిర్యాదు చేశానని.. పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే కేంద్రం అండ బలంగా ఉంది కాబట్టే పవన్ కళ్యాణ్ ఇంత ధైర్యంగా ఉన్నారు అని అంతా అంటున్నారు.
Also read:
- శ్రీదేవి లైఫ్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని మీకు తెలుసా..?
- సినీ, రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ వల్లే ఇన్ని మార్పులు..!
- ఆ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ‘పరేషాన్’ సినిమా.. ఎప్పుడంటే..?