Advertisement
కార్తీక మాసం నుంచి సంక్రాంతి వరకు అయ్యప్ప స్వామి భక్తులు మాల ధారణం చేస్తారన్న సంగతి తెలిసిందే. నలభై ఒక్క రోజుల పాటు మండల దీక్షను తీసుకుంటూ ఉంటారు. అయితే.. ఈ మండలం రోజుల పాటు కఠినమైన నియమ నిష్టలతో నియమాలను పాటిస్తూ ఉంటారు. అయ్యప్ప స్వామి దీక్ష పాటించాలంటే దీక్షలో నియమాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. శాస్త్రపరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా దృష్టిలో ఉంచుకుని ఈ నియమాలను రూపొందించారు.
Advertisement
అసలు ఈ నియమాలు ఏమిటి? వాటి వెనుక కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసం మొదలు మార్గశిర, పుష్య మాసాల వరకు కఠిన అయ్యప్ప మాల దీక్షను తీసుకుంటూ ఉంటారు. అప్పటి నుంచి కొత్త నియమాలను పాటిస్తుంటారు. నిరంతరం స్వామి భక్తిలో ఉంటూ.. స్వామి భక్తులతో సమయం గడుపుతూ ఉంటారు. తెల్లవారు జామునే చన్నీటి స్నానం చేస్తూ ఈ నియమాలు మొదలయ్యి రాత్రి కటిక నేలపై నిద్రతో ఈ నియమాలు ముగుస్తాయి. గురుస్వామి , తల్లితండ్రులు, అర్చక స్వామి ద్వారా మాత్రమే ఈ మాలధారణ చేయాలి. మాల ధారణ తీసుకునే ముందు రోజు మద్యం, మాంసం ముట్టకూడదు. దీక్ష పూర్తి అయ్యేవరకు మాంసాహారం తినకూడదు.
Advertisement
అయ్యప్ప మాల ధారణ వేసిన వారు నలుపు రంగు దుస్తులను మాత్రమే ధరించాలి. ఈ దీక్షలో పాల్గొనే వారంతా నల్లని దుస్తులను ఎందుకు ధరిస్తారంటే.. శని దేవుడికి నల్లని దుస్తులంటే ప్రీతి. నలుపు రంగు దుస్తులు ధరించి నిత్యం పూజల్లో పాల్గొనే వారి జోలికి శని రాడు. మరొక ఆరోగ్యపరమైన కారణం ఏంటంటే.. అయ్యప్ప మాల ధారణ చేసేది చలికాలంలో కాబట్టి ఆ సమయంలో నల్లని దుస్తులు ధరిస్తే.. అవి శరీరానికి వెచ్చదనాన్ని అందిస్తాయి. మాల ధరించిన వ్యక్తిని ఎవరూ పేరు పెట్టి పిలవకూడదు. ఆయనలో ఆ స్వామి ఉన్నాడు అన్న భావనతో.. ఆ వ్యక్తిని “స్వామి” అని మాత్రమే పిలవాలి. అలాగే ఆ వ్యక్తి కూడా అందరిలోనూ ఆ స్వామినే చూస్తూ.. అందరిని స్వామి అనే పిలవాలి.
Read More:
ప్రియుడిని ఇంటికి పిలిచింది.. దొరికిపోయేసరికి ప్లేట్ మార్చి, చెప్పుతో కొట్టింది.. ఆ తర్వాత?
Maa Oori Polimera Director Anil Vishwanath Age, Biography, Movies, Family Details
100 + Funny Telugu Riddles with Answers and Images సుడోకులు, పజిల్స్