Advertisement
బోయపాటి డైరెక్షన్ లో రామ్ పోతినేని హీరోగా స్కంద సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 28 వ తేదీన విడుదల అయ్యింది. రెండు తెలుగు రాష్ట్రాలలోను రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా విడుదల అయ్యింది. విడుదల అయిన మొదటి రోజు నుంచే స్కంద సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ఈ సినిమాలో ఉన్న పొలిటికల్ డైలాగ్స్ పై కూడా ఓ రేంజ్ లో చర్చ జరుగుతోంది.
Advertisement
ఇవి కూడా చదవండి: చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్.. మళ్లీ తెరపైకి ఓటుకు నోటు కేసు..!
ఇవి కూడా చదవండి:కేసీఆర్ ను ఓడించిన ఈ ఒకే ఒక్క వ్యక్తి గురించి తెలుసా? ఇతను ఎవరంటే?
Advertisement
సినిమాలలో రాజకీయ నాయకులపై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేయడం ఎప్పటి నుంచో వస్తూనే ఉంది. తాజాగా నేడు విడుదల అయిన స్కంద సినిమాలో కూడా ఇదే ట్రెండ్ ఫాలో అయ్యారు అనిపిస్తుంది. ఎక్కువగా బాలయ్య సినిమాల్లో ఈ పొలిటికల్ సెటైర్స్ కనిపిస్తాయి. ఇక బోయపాటి శ్రీను కూడా తన సినిమాల్లో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పొలిటికల్ సెటైర్స్ వేస్తూనే ఉంటారు. గతంలో చాలా సినిమాలలో ఇవి కనిపించాయి. ఇప్పుడు స్కంద సినిమాలో కూడా ఇది రిపీట్ అయ్యింది.
ఇప్పటికే ఉన్న డైలాగ్స్ హైలైట్ అయ్యాయి. అయితే.. ఇవి కాకుండా రచ్చ లేపే పొలిటికల్ డైలాగ్స్ వేరే ఉన్నాయట. ఈ డైలాగ్స్ మిస్ అయ్యాయి అంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని అరెస్ట్ చేయడం వల్లే ఈ డైలాగ్స్ మిస్ అయ్యాయి అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. నిర్మాతలే రిక్వెస్ట్ చేసి మరీ వైసీపీ కి వ్యతిరేకంగా ఉన్న డైలాగ్స్ ని తీసేయించారని తెలుస్తోంది. కొన్ని డైలాగ్స్ కి డబ్బింగ్ మార్పించి తిరిగి చెప్పించారని తెలుస్తోంది. ఒకవేళ చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయించకుండా ఉండి ఉంటె.. ఈ డైలాగ్స్ కూడా ఉండేవని.. సినిమా వేరే లెవెల్ లో ఉండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఎన్టీఆర్ వలన ఒరిగిందేమీ లేదు.. షాక్ అవుతున్న బాలకృష్ణ చిన్న అల్లుడి కామెంట్స్..!