Advertisement
రాఖీ, రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు. అన్నకు గాని, తమ్మునికి గాని ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖి అని పిలిచే ఒక పట్టిని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం. ఈసారి శ్రావణ పూర్ణిమ రెండు రోజులు కావడంతో రాఖీని ఏ రోజు జరుపుకుంటారు అని తికమక పడుతున్నారు. అసలు ఎప్పుడో తెలుసుకుందాం.
Advertisement
Also Read: సర్కార్ వారి పాటలో ఈ మిస్టేక్ ను గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అబ్బా!
హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణం నెల చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈనెల శుక్లపక్ష పౌర్ణమి రోజున రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు. అన్నదమ్ముల ప్రేమకు ప్రత్యేకగా ఈ పండుగ సందర్భంగా, సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కట్టుకుంటారు. ఈసారి పౌర్ణమి ఆగస్టు 11,12 రెండు రోజుల పాటు వస్తుంది. అందుకే రాఖీ పండుగను ఏరోజు జరుపుకోవాలో తెలియక జనం అయోమయంలో పడ్డారు.
Advertisement
శ్రావణ పౌర్ణమి ఆగస్టు 11వ తేదీ ఉదయం 10: 38 గంటలకు ప్రారంభమై 12వ తేదీ శుక్రవారం ఉదయం 07:05 గంటలకు ముగుస్తుందని తెలుసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో రాఖీని ఏ రోజు జరుపుకుంటారనే సందేహం ప్రజల్లో నెలకొంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు 11 గురువారం పౌర్ణమి రోజు అయినందుకు ఆగస్టు 11న రక్షాబంధన్ పండుగ జరుపుకుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం గురువారం ఆగస్టు 11 న పౌర్ణమి ఈ రోజున సోదరీమణులు తమ సోదరులకు రాఖీ కడతారు. ఈరోజు రాఖీ కట్టడానికి 12 గంటల తర్వాత సమయం శుభప్రదం అని చెబుతారు. ఈ రోజున 5:17 నుండి 6:18 వరకు సమయం శుభప్రదం. ఈరోజు సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు, సోదరీమణులు అతని దీర్ఘాయువు కోసం ప్రార్థిస్తారు. అదే సమయంలో సోదరులు కూడా సోదరీమణులకు బహుమతులు ఇస్తారు. వారిని కాపాడతారని వాగ్దానం చేస్తారు.
Read Also : ఉదయ్ కిరణ్ తో మల్టీస్టారర్ మూవీ..నో చెప్పిన తరుణ్.. ఆ సినిమా ఏంటంటే..?