Advertisement
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నచ్చడు అన్న సంగతి తెలిసిందే. ఆ విషయం పాలిటిక్స్ లో ఆయన తీసిన సినిమాలను చూస్తేనే తెలుస్తుంది. అయితే.. రామ్ గోపాల్ వర్మకు చంద్రబాబు నాయుడు నచ్చకపోవడానికి కారణం ఏంటో మాత్రం చాలా మందికి తెలియదు. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్వయంగా ఆర్జీవినే ఆ విషయాన్నీ చెప్పుకొచ్చారు.
Advertisement
నిత్యం తనదైన శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి తనకి ఏది అనిపిస్తే అదే మాట్లాడేస్తూ ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా అంతే. తనకి ఏది అనిపిస్తే అదే పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇటీవల ఆయన ఎపి రాజకీయాలపై ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు వేస్తున్నారు. ఎపి రాజకీయాలపై ఆయన సినిమాలు కూడా తీసిన సంగతి తెలిసిందే. గతంలో ఆయన లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీశారు. తాజాగా ఎన్నికల నేపథ్యంలో వ్యూహం, శపథం అనే సినిమాలను కూడా తీశారు. వ్యూహం సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉన్నప్పటికీ సెన్సార్ బృందం సర్టిఫికెట్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు.
Advertisement
రాజకీయాలపై ఆయన ఫోకస్ చూసిన చాలా మందికి చంద్రబాబు నాయుడు పై ఆర్జీవికి ఎందుకు ఇంత కోపం ఉందా? అని సందేహం రాక మానదు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ మాట్లాడిన ఆర్జీవీ వైస్రాయ్ హోటల్ ఘటన జరిగినప్పటి నుంచీ చంద్రబాబు నాయుడు అంటే తనకి పగ ఉందని అన్నాడు. ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి.. టీడీపీ అధికారాన్ని లాక్కున్నారని, అందుకే ఆయన తనకి నచ్చరని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తీసిన వ్యూహం సినిమాలో జనాలకు తెలియని చాలా విషయాలు ఉన్నాయని, చంద్రబాబు నాయుడు బండారం ఆ సినిమాతో బయటపడుతుందనే.. ఆ సినిమాను రిలీజ్ అవ్వనివ్వకుండా చేస్తున్నారని అన్నారు.
Read More:
Indian Cricket Team: మొన్నటిదాకా విలన్.. ఇప్పుడేమో హీరో.. టీం ఇండియా సక్సెస్ వెనుక అసలు కారణం ఇతనే!
క్రికెట్ లో “టైం అవుట్” అంటే ఏమిటి? మాథ్యూస్ ఎందుకు మ్యాచ్ నుంచి డిస్మిస్ అయ్యాడు?
ఈగ సినిమాలో ఇది గమనించారా? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు రాజమౌళి గారు?