Advertisement
వరల్డ్ కప్ హడావిడి ముగిసి టి20 సిరీస్ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా తో జరిగిన ఐదు టి20 సిరీస్ లతో టీం ఇండియా కు శుభ ఆరంభం అయ్యింది. విశాఖపట్నం వేదికగా జరిగిన తోలి టి20 లో ఇండియాకు రికార్డు విజయం దక్కింది. మొదట బాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 208 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. అయితే.. ఆస్ట్రేలియా బ్యాటర్స్ లో జోష్ మెరుపు సెంచరీని చేసాడు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన భారత్ రెండు వికెట్ల తేడాతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.
Advertisement
ఈ మ్యాచ్ లో విజయం భారత్ దే అయినా ఆఖరి ఓవర్లో మాత్రం కొంత కన్ఫ్యూషన్ నెలకొంది. సీన్ అబాట్ ఆఖరిగా బంతి వేసినపుడు ఇండియా కు అప్పటికి 7 పరుగుల అవసరం ఉంది. స్ట్రైక్ లో ఉన్న రింకు మొదటి బంతిని బౌండరీ దాటించాడు. దీనితో ఇండియా సమీకరణం కాస్తా ఐదు బంతులకు మూడు పరుగులుగా ఉంది. రెండో బంతికి బైస్ రూపంలో ఓ పరుగు లభించగా, తర్వాత మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు అవుట్ అయ్యారు. అక్షర్ క్యాచ్ అవుట్ అవ్వగా.. బిష్ణోయ్, అర్ష్ దీప్ స్ట్రైక్ ఇచ్చే క్రమంలో రన్ అవుట్ అయ్యారు.
Advertisement
ఇక ఆఖరి బంతికి ఒక్క పరుగు కావాల్సి వచ్చింది. ఆ బంతికి రింకు సిక్స్ కొట్టి భారత్ కి విజయాన్ని ఇచ్చారు. అయితే.. ఇండియా గెలిచింది. కానీ ఇండియా స్కోరులో కానీ, రింకు వ్యక్తిగత స్కోర్ లో కానీ ఈ సిక్సర్ జమ కాలేదు. ఇది జమ అవ్వలేదో చాలా మందికి అర్ధం కాలేదు. మెన్స్ టి 20 రూల్స్ ప్రకారం 16.1, 16.2, 16.3.1 ల ప్రకారం మ్యాచ్ ఆఖరి నిమిషంలో ఫలితం తేలే సమయంలో తరువాత ఏమి జరిగిందన్న విషయం గురించి పట్టింపు ఉండదు. ఇక్కడ ఆఖరి బంతిని వేసిన పేసర్ అబాట్ ఓవర్ స్టెప్ చేయడంతో.. అంపైర్ నో బాల్ ప్రకటించాడు. అయితే అది కాస్త లేటుగా ప్రకటించాడు. అంటే ఇక్కడ ఐసీసీ రూల్స్ ప్రకారం మ్యాచ్ ఫలితం ఖరారయ్యే సందర్భంలో వచ్చే పరుగులను పరిగణనలోకి తీసుకోరు. ఛేజింగ్ లో ఒక్క పరుగు ఉంటె చాలు అనుకున్నప్పుడు బ్యాటర్ సిక్స్ కొట్టినా అతను చేసిన రన్స్ నుంచే కౌంట్ తీసుకుంటారు. ఇక్కడ కూడా నో బాల్ ద్వారా వచ్చిన ఒక పరుగుతో భారత్ విజయాన్ని కౌంట్ చేసారు. ఇక రింకు కొట్టిన సిక్స్ ను పట్టించుకోలేదు. ఒకవేళ ఒక పరుగు కంటే ఎక్కువ పరుగులు అవసరం అయితే.. అప్పుడు రింకు కొట్టిన సిక్స్ గురించి పరిగణనలోకి తీసుకునేవారు.
Read More:
బొమ్మరిల్లు స్టోరీ చెప్పాక.. ఈ సినిమా నేను చేస్తే ఫ్లాప్ అవుతుంది అని చెప్పిన హీరో ఎవరో తెలుసా?
Shivani Rajashekar Age, Biography, Movies, and Family, Love, Phone Number, Height, Wiki Details
Kotabommali Movie Review: కోటబొమ్మాళి మూవీ రివ్యూ.. శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్టా..?