Advertisement
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసే సమయంలో ప్రతి ఒక్కటి ఆలోచించి చేస్తుంటారు. పెళ్లి అనేది జీవితాంతం గుర్తుండిపోయే మధురమైన ఘట్టం. పెళ్లి జరిగిన క్షణాలు ఎప్పటికీ మన కళ్ళ ముందు మెదులుతుంటాయి. అయితే పెళ్లి చేసుకోవాలనుకునే ముందు సవా లక్షల ఆలోచనలు మదిలో ఉంటాయి. ముఖ్యంగా అమ్మాయిల వయసు అబ్బాయి కంటే తక్కువగా ఉండేలా చూస్తారు. మూడు నాలుగు సంవత్సరాల వయసు బేధం ఉండాలని పెద్దలు చెబుతారు. అసలు అమ్మాయి కంటే అబ్బాయి వయసు ఎందుకు ఎక్కువగా ఉండాలి? భార్య కంటే భర్త ఎందుకు పెద్దవాడై ఉండాలి? అసలు ఎందుకు ఈ నియమం పెట్టారు? భర్త కంటే భార్య వయసు ఎక్కువ ఉంటే కలిగే నష్టం ఏమిటి? హిందూ ధర్మశాస్త్రం వైవాహిక వ్యవస్థ గురించి ఏం చెబుతుంది? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Advertisement
Read also: KONIDELA NIHARIKA – CHAITANYA: మెగా ఫాన్స్ కి బిగ్ షాక్ ! నిహారిక – చైతన్యలు విడిపోతున్నారా ??
Advertisement
మానసిక, శారీరక కారణాల వల్లనే ఆడ, మగ వివాహ వయసులో వ్యత్యాసం ఉందని నిపుణులు చెబుతున్నారు. భార్యాభర్తల మధ్య నాలుగు ఐదు సంవత్సరాల వ్యత్యాసం ఉండడం వల్ల, భర్త భార్య కంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాలు పెద్దవాడు కావడం వల్ల కలిగే నష్టం లేదని, కానీ స్త్రీ భర్త కంటే వయసులో పెద్దది అయితే వారి ఆలోచన సరళిలో మార్పు, త్వరగా వృద్ధాప్య ఛాయలు వంటివి కలుగుతాయని, దానివల్ల భార్యాభర్తల దాంపత్య జీవితానికి ఇబ్బంది కలిగి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఇక పురుషులు కాస్త ఆలస్యంగా పరిపక్వత చెందుతారు. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా స్త్రీలు ముందుగా పరిపక్వత చెందుతారు.
అదేవిధంగా పురుషుడి కంటే స్త్రీకి నాలుగేళ్లు ముందుగా ముసలితనం వస్తుంది. కాబట్టి ఒకే వయసు వాళ్ళు పెళ్లి చేసుకుంటే స్త్రీకి ముందుగానే వృద్ధాప్యం వస్తే భర్త ఆమెకు సేవలు చేయలేడు. అంతేకాకుండా మగవాళ్ళు మానసికంగా పరినితి చెందకముందే ఆడవారికి అమోఘమైన మానసిక పరిణితి ఉంటుంది. కాబట్టి తనకంటే నాలుగు లేదా ఐదు సంవత్సరాలు పెద్దవాడైన పురుషుడిని పెళ్ళి తీసుకున్నప్పటికీ స్త్రీకి అందుకు తగ్గ మానసిక పరిణితి ఉంటుంది. అదే మగవాళ్లకు స్త్రీలకు తగ్గట్టుగా మానసిక పరిణితి ఉండదు. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే పెద్దవారు అయితేనే వారికి వివాహం చేస్తే వారి కాపురం సవ్యంగా ఉంటుందని భావిస్తారు.
Read also: TILAPIA FISH AND BENEFITS, IMAGES IN TELUGU: “టిలాపియా” ఫిష్ తింటే కలిగే ఉపయోగాలు, దుష్ప్రభావాలు..!