Advertisement
ఎవరైనా చనిపోతే వారి కర్మకాండలను కొడుకులు చేస్తూ ఉంటారు. పురాతన కాలం నుండి ఈ పద్ధతిని పాటిస్తూ ఉన్నాము అంత్యక్రియలు కర్మ కాండలు కొడుకులే చేస్తారు. కనీసం తల్లిదండ్రులకు అంత్యక్రియలు చేసేందుకైనా కొడుకు పుట్టాలి అని కోరుకుంటున్నారు. అయితే కొడుకుల ఎందుకు అంతక్రియలు చేయాలి..? దాని వెనక అర్థం ఏంటి..? కొడుకులని పుత్రుడు అని కూడా అంటారు. పుత్ర అనే పదం రెండు అక్షరాలతో రూపొందించారు అని గ్రంథాలు చెబుతున్నాయి.
Advertisement
పు అంటే నరకం. త్ర అంటే జీవితం. దీని ప్రకారం కొడుకు అంటే నరకం నుండి రక్షించేవాడు అన్నమాట. తండ్రి లేదా తల్లి మరణిస్తే వాళ్ళని నరకం నుండి ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లేవాడు అని నమ్ముతారు. ఈ కారణంగా అంత్యక్రియలను కొడుకు నిర్వహిస్తాడు. అదే సమయంలో దీని వెనుక ఉన్న ఇంకో కారణం ఏంటంటే ఆడపిల్ల లక్ష్మి స్వరూపంగా ఉన్నట్లే కొడుకుని విష్ణుమూర్తిగా భావిస్తారు. విష్ణువు అంశ అంటే పోషించేవాడు.
Advertisement
అమ్మాయిలు కూడా బాధ్యతను తీసుకోగలుగుతున్నారు. ఇక్కడ ఇలా ఆచారాల నియమం రూపొందించిన సమయంలో బాలికలు కుటుంబాన్ని చూసుకునే సామర్థ్యాన్ని కలిగి లేరు. వాళ్ళకి ప్రత్యేక హక్కులు లేవు. సంవత్సరాలు గడిచేకొద్దీ సంప్రదాయం మారుతూ వచ్చింది ఈ కాలంలో ఆడపిల్లలు కూడా అంతేక్రియలు చేస్తున్నారు. ఇంటి పెద్ద చనిపోయాక వారు మొత్తం ఇంటిలోనే ప్రతి సభ్యుని పూర్తి బాధ్యతను కూడా తీసుకుంటున్నారు అయినప్పటికీ ఈ ఆచారం ఇప్పటికీ చాలా ఇళ్లల్లో కొనసాగుతోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!