Advertisement
ప్రపంచ అత్యంత ధనవంతుడు ఎలాన్ మస్క్ ట్విట్టర్ ను దక్కించుకున్న తర్వాత ఆ సంస్థలో మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సోషల్ మైక్రో బ్లాగింగ్ సైట్ లో అంతకుముందు వెరిఫైడ్ ఖాతాలకు బ్లూ ట్రిక్ కనబడేది. మస్క్ వచ్చిన తర్వాత ఈ బ్లూ టిక్ కావాలనుకుంటే 8 యుఎస్ డాలర్లు చెల్లించాలని కండిషన్ పెట్టాడు. అయితే గతంలో అఫీషియల్ ఖాతాలన్నింటికీ బ్లూ టిక్ లే ఉండేవి. కానీ ఇప్పుడు మస్క్ ఆ పద్ధతిని మార్చాడు. కొత్త రూల్ ప్రకారం ట్విటర్ లో వ్యక్తులు, సంస్థలు, కంపెనీలను విభజించాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ వెరిఫైడ్ టిక్ ఉంటుంది.
Advertisement
ట్విటర్ కొత్త పాలసీ ప్రకారం, వెరిఫైడ్ కంపెనీస్, అఫీషియల్ బిజినెస్ అకౌంట్స్ కు గోల్డ్ టిక్ ను కేటాయించారు. ఇక గవర్నమెంట్ అకౌంట్ కు గ్రే కలర్ ను ఇవ్వగా, ఇండివిడ్యువల్ బ్లూ కలర్ ప్రత్యక్షమైంది. ఈ మార్పులలో భాగంగానే బీసీసీ ట్విటర్ ఖాతా వెరిఫైడ్ టిక్ గోల్డ్ కలర్ లో కనబడుతున్నది. బీసీసీఐ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది ప్రభుత్వ పరిధిలోకి రాదు. సాధారణంగా మిగిలిన క్రీడలు అన్ని నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కిందకు వస్తాయి. కానీ బీసీసీఐ మాత్రం ప్రత్యేకం. దీనిపై ప్రభుత్వ పెత్తనం ఉండదు.
Advertisement
మరోవైపు విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు, అలాగే స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మీడియా అఫీషియల్ ట్విట్టర్ ఖాతా చూస్తే ఈ విషయం ప్రస్పుటమవుతుంది. సాయ్ కు వెరిఫైడ్ టిక్ బ్లూ కలర్ లోనే ఉండడం గమనార్హం. సాయ్ పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ప్రతి స్పోర్ట్స్ అసోసియేషన్ కు బ్లూ టిక్ అలాగే ఉంది. కానీ బీసీసీఐ ప్రభుత్వ పెత్తనం ఉండదు. అలాగే, కోహ్లీ ఒక సెలబ్రీటీ. సెలబ్రీటీలకు ఎప్పటిలాగే బ్లూ టిక్ ఇచ్చారు. అటు ప్రభుత్వ పెత్తనం లేని అతి పెద్ద సంస్థ కాబట్టి, బిసిసిఐ ట్విట్టర్ ఖాతాకు గోల్డ్ కలర్ టిక్ ఇచ్చారు.
Also Read: మీనా భర్త విద్యాసాగర్ ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలిస్తే షాకవుతారు..?