Advertisement
సాధారణంగా ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే, వధూవరులు కుటుంబ సభ్యులు గోత్రాన్ని అడిగి ఇరు గోత్రాలు వేరైతే అప్పుడు పెళ్లి చేయాలని నిశ్చయించుకుంటారు. ఒకే గోత్రం ఉన్న వాళ్ళని ఇచ్చి పెళ్లి చేయరు. ఒకే గోత్రం ఉన్న వాళ్ళకి పెళ్లిళ్లు చేయడం జరగదు. హిందూ సాంప్రదాయంలో ఇద్దరు గోతాలు ఒకే గోత్రం కలిగి ఉంటే, వాళ్ళని సగోత్రీకులు అని అంటారు. సగోత్రీకులు మధ్య వివాహాలను చేయుటకు పెద్దలు అనుమతి ఇవ్వరు. గోత్రం అనే పదం గౌ అనే సంస్కృత పదమూలం నుండి వచ్చింది. గౌ అంటే ఆవు అని అర్థం. గోత్రం అనే పదానికి గురువు, భూమి, వేదం, గోవుల సమూహం ఇలా పలు అర్థాలు ఉన్నాయి. గోత్రం అంటే వంశోత్ పాలకులైన ఆది మహర్షులలో మొదటి మహర్షి మూల పురుషుడి పేరు.
Advertisement
Advertisement
పురాతన కాలంలో గోవులే ధనం. ఒకచోట నుండి ఇంకో చోటకి వలస వెళ్తుండేవారు. అటువంటి సమయంలో గోవుల రక్షణకే గోత్రాలని ఏర్పరిచారు. గోవులు మరొక గోవుల్లో కలిసిపోవడం వలన వచ్చే గొడవల్ని తపోనిష్టతో ఉండే గోత్ర పాలకులు తీర్చే వాళ్ళు. అటువంటి గోత్ర పాలకుల పేర్లే ఆపై వారి వారి సంతానానికి గోత్రనామాలుగా అయ్యాయి. పూజల్లో, యజ్ఞంలో, యాగాలలో, పెళ్లిళ్లపుడు గోత్రం యొక్క పాత్ర ఎంతో ఉంది. ఒకే గోత్రం వాళ్లు యొక్క జన్యుల యొక్క నమూనాలు కూడా కొద్దిగా ఒకే రీతిలో ఉంటాయి. దాంతో వీరు పెళ్లి చేసుకుంటే సరైన సంతానం కలగకపోవచ్చు అని సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది.
ఒకే గోత్రం ఉన్నవాళ్లు పెళ్లి చేసుకుంటే సంతానంలో లోపాలు వంటివి కలుగుతుంటాయి. ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు సోదర సమానులు. ఎలా అయితే ఒకే తండ్రి పిల్లలు అన్నా చెల్లెలు అవుతారో అలానే ఒకే గోత్రానికి చెందిన వాళ్ళు అన్నదమ్ములు, అక్క చెల్లెలు అవుతారు. అందుకని పెళ్లి చేసుకోవడానికి ముందు గోత్రాన్ని అడిగి, ఒకే గోత్రం ఉంటే వాళ్లకి పెళ్లి చేయరు. ఒకే గోత్రం వాళ్లకు ఎప్పుడు వివాహం చేయకూడదు. చూశారు కదా గోత్రం అంటే ఏమిటో, ఎందుకు ఓకే గోత్రం వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయరు అనేది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!