Advertisement
మనం గమనించినట్లయితే టెస్ట్ మ్యాచ్ అప్పుడు క్రికెటర్లు తెల్లటి బట్టల్ని మాత్రమే వేసుకుంటారు. అయితే ఎందుకు టెస్ట్ క్రికెట్ ఆడేటప్పుడు ఆటగాళ్లు తెల్లటి జెర్సీని వేసుకోవాలి..? దాని వెనక కారణం ఏంటి అనే విషయాన్ని ఇప్పుడే తెలుసుకుందాం.. టెస్ట్ మ్యాచ్ల ని మనం చూసినట్లయితే ఇవి ఐదు రోజులు పాటు సాగుతూ ఉంటాయి ఎండలో రోజంతా కూడా ఆడాల్సి ఉంటుంది. అంత సేపు ఎండలో ఆడాలంటే తెల్లటి బట్టలు మంచిది. తెల్లని బట్టలు వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సూర్యకిరణాలు శరీరంపై ఎఫెక్ట్ చేయవు. దీంతో చల్లగా ఉంటుంది. ఏ మాత్రం హీట్ అనిపించదు.
Advertisement
ఇదే కాకుండా టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు తెల్లటి జెర్సీ వేసుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది. తెల్లటి బట్టలు వేసుకుని టెస్ట్ మ్యాచ్ ఆడడం వలన ఇంకో బెనిఫిట్ ఉందట అదేంటంటే ఇది వరకు టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఎర్రటి బంతితో ఆడేవారు. ఎర్రటి బంతితో ఆడేటప్పుడు బాల్స్ క్లియర్ గా కనపడడానికి తెల్లటి జెర్సీలు వేసుకోవడం జరిగింది ఆటగాళ్లకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఆడేటప్పుడు ఎంతో క్లియర్ గా బాల్ కనపడుతుంది ఆట మీద ఫుల్ ఫోకస్ పెట్టొచ్చు.
Advertisement
చక్కగా ఆటగాళ్లు బంతి మీద ఫోకస్ పెట్టి ఆడుకోవడానికి ఈ తెల్లటి బట్టలు హెల్ప్ అవుతాయి. ఇలా ఈ రెండు ఉపయోగాలు టెస్ట్ మ్యాచ్ ఆడేటప్పుడు ఉంటాయి. తెల్లటి బట్టలు వేసుకోవడం వలన ఈ ఉపయోగాలు రెండు ఉంటాయి అందుకనే టెస్ట్ మ్యాచ్ టైం లో తెల్లటి బట్టలు వేసుకుంటారు ఆటగాళ్లు. ఈ పద్ధతి ఎప్పటినుండో ఉంది ఇప్పుడు కూడా కొనసాగుతూనే ఉంది. ఇది మంచి పద్ధతి కాబట్టి ముందు ముందు కూడా ఈ పద్ధతి ని ఫాలో అవుతారు. తెల్లటి బట్టలతో క్రికెటర్లు టెస్ట్ క్రికెట్ ఆడటం వలన సౌకర్యంగా అలానే బాల్ మీద ఫోకస్ చేసే విధంగా ఉంటుంది. ఇదేనండి తెల్లటి దుస్తులు వేసుకుని ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ ఆడటానికి కారణం.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!