Advertisement
ఒకప్పుడు పాతికేళ్లు దాటిన వెంటనే పెళ్లి చేసుకునేవారు. కానీ ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లిళ్లు చేసుకోవడానికి సిద్ధంగా ఉండటం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది నిరుద్యోగ సమస్య. ఈ సమస్య వల్ల చాలా మంది లేటు వయసులో వివాహం చేసుకుంటున్నారు. ఏదో ఒక ఉద్యోగం సాధించాలని పట్టుదలతో ఏళ్ల తరబడి పుస్తకాలకు అతుక్కుపోతున్నారు. ఇదిలా ఉండగా, పెళ్లిలో తెలుపు రంగు దుస్తులని ఎందుకు వేసుకుంటారో తెలుసా? అదే ఇప్పుడు తెలుసుకుందాం. విదేశీ మహిళలు పెళ్లిలలో తెలుపు రంగు దుస్తులను వేసుకునే సాంప్రదాయం 1840 సంవత్సరంలో మొదలైందని చెప్పవచ్చు.
Advertisement
అప్పట్లో క్వీన్ విక్టోరియా, ప్రిన్స్ ఆల్బర్ట్ ల వివాహం జరిగింది.అయితే తన పెళ్లి సందర్భంగా క్వీన్ విక్టోరియా తెలుపు రంగు డ్రెస్ వేసుకుంది. దీంతో చాలామంది అ డ్రస్ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఇక మిగిలిన వారు కూడా అలా తెలుపు రంగు డ్రెస్ ను వేసుకుని పెళ్లిళ్లు చేసుకోవడం మొదలుపెట్టారు. అలా ట్రెండ్ స్టార్ట్ అయింది. అయితే తెలుపు రంగు డ్రెస్ నే వధువు వేసుకునేందుకు పలు కారణాలు కూడా ఉన్నాయి. అవేమిటంటే, తెలుపు స్వచ్ఛతకు, శాంతికి చిహ్నం. దీంతో పెళ్లి చేసుకునేవారు కూడా మనసులో ఎలాంటి కల్మషం లేకుండా అలా స్వచ్ఛంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తారు.
Advertisement
READ ALSO : ఆనంద్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉందో తెలుసా.. ఈమె ఎంతో మందికి ఆదర్శం..!!
అందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. ఇక ఇందుకు ఉన్న మరో కారణం ఏమిటంటే, తెలుపు కొత్త జీవితానికి సూచిక. ప్రశాంతంగా జీవించాలని విషయాన్ని చెబుతుంది. అందుకనే పెళ్లి చేసుకునే దంపతులు కొత్త జీవితాన్ని ప్రారంభించాలని, ప్రశాంతంగా జీవించాలని తెలియజేసేందుకే తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు. దీంతోపాటు వివాహ వేడుకలో అందరికన్నా ప్రత్యేకంగా వధువు కనిపించాలని ఉద్దేశంతోనే అలా తెలుపు రంగు దుస్తులను ధరిస్తారు.
READ ALSO : శంకర్ – రామ్ చరణ్ ల ‘గేమ్ చెంజర్’ సినిమా పోస్టర్ లో ఇది గమనించారా ? ఇక్కడ ఉన్న లోగో వెనుక ఇంత అర్థం ఉందా ?