Advertisement
భర్త ప్రేమించిన టిక్ టాక్ యువతితో దగ్గరుండి, అలంకరించి మరి సెప్టెంబర్ 21 రెండో పెళ్లి చేసింది ఓ భార్య. తిరుపతి జిల్లా డక్కిలి మండలంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన కళ్యాణ్ అనే యువకుడు డిగ్రీ వరకు చదివాడు. టిక్ టాక్ లో వీడియోల ద్వారా పాపులర్ అయిన అతనికి తోలుత విశాఖకు చెందిన ఓ నిత్యశ్రీ తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత మళ్లీ టిక్ టాక్ లోనే పరిచయమైన కడపకు చెందిన మరో యువతి అయిన విమలను పెళ్లి చేసుకున్నాడు కళ్యాణ్.
Advertisement
ఇంతలో తోలుత ప్రేమించిన నిత్యశ్రీ, తిరుపతిలోని ప్రియుడి ఇంటికి సడన్ ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పటికే అతనికి పెళ్లయిందని తెలుసుకొని, వెనుదిరిగి వెళ్లకుండా యువకుడి భార్యతో మాట్లాడి, అతనిని ప్రేమించానని, అందరం కలిసి ఇదే ఇంట్లో ఉందామని చెప్పడంతో అతని భార్య మొదట కంగారుపడిన చివరకు అంగీకరించింది. దీంతో భర్తను, భర్త ప్రియురాలిని స్వయంగా అలంకరించి ఇద్దరికీ వివాహం జరిపించింది.
Advertisement
అయితే, టిక్ టాక్ లో పరిచయమైన యువతి తో భర్తకు పెళ్లి చేసిన భార్య ఘటనలో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. తనకూ, తన భర్తకు జరిగిన పెళ్లిలో మొదటి భార్యగా చెబుతున్న విమల అనే మహిళకు ఎలాంటి సంబంధం లేదని, నిత్యశ్రీ చెప్పడం ఆసక్తికరంగా మారింది. పెళ్లి జరిగిన తర్వాత పెళ్లి కుమారుడు కళ్యాణ్ కనబడకుండా వెళ్లిపోయాడు. మొదటి భార్యను నేనే, మొదటి ప్రేమికురాలిని నేనే అంటూ నిత్యశ్రీ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. తనకు, తన భర్తకు పెద్దల సమక్షంలో పెళ్లి చేశారని, తన మొదటి భర్త అని చెప్పుకునే విమలకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగాయని రహస్యాన్ని వెల్లడించింది. తన భర్తకు మాయమాటలు చెప్పి విమల, కళ్యాణ్ ను తీసుకువెళ్లిందని, వారం రోజులు భర్త కళ్యాణ్ కోసం వేచి చూస్తానని చెప్పింది. అప్పటికి కళ్యాణ్ రాకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని కన్నీటి పర్యంతమైంది.
Read also : మెగాస్టార్ చిరును ఈ ఇద్దరు హీరోయిన్లు బాగా ఇబ్బంది పెట్టరాట..?