Advertisement
ఏపీ ఎన్నికల రాజకీయం కీలక దశకి చేరుకోబోతోంది. ముఖ్య నేతలు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ బస్సు యాత్ర 18వ రోజు తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. ఈనెల 23న పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు చంద్రబాబు నాయుడు కుప్పంలో నామినేషన్ దాఖలు నిన్న చేశారు. అధికారంలోకి రావడానికి కీలకమైన గోదావరి జిల్లాలో జగన్ పవన్ పోటీ చేస్తున్న పిఠాపురం రోడ్ షో లో పాల్గొన్నారు. జగన్ ఎస్టీ రాజాపురం నుంచి బయలుదేరి రంగంపేట పెద్దాపురం బైపాస్ సామర్లకోట బైపాస్ మీదుగా ఉన్న క్రాస్ చేరుకొని భోజనం చేసి తర్వాత ఉందురు క్రాస్ కాకినాడ బైపాస్ మీదగా సాయంత్రం మూడున్నర గంటలకి కాకినాడ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్నారు.
Advertisement
ఆ తర్వాత పిఠాపురం గొల్లప్రోలు కత్తిపూడి తుని పాయకరావుపేట బైపాస్ మీదుగా గుడిచర్ల క్రాస్ రాత్రి బస్సు శిబిరానికి చేరుకున్నారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో జగన్ మోహన్ రెడ్డి రోడ్ షో నిర్వహించిన నిర్వహించారు. ఇప్పటికే పిఠాపురం మీద జగన్ ముఖ్య నేతలకు దిశా నిర్దేశం చేశారు. పిఠాపురంలో వంగ గీత వైసిపి తరఫునుండి పోటీ చేస్తున్నారు పార్టీ ముఖ్యులు గీతకి సపోర్ట్ ఇస్తున్నారు. పిఠాపురంలో గెలుపు కచ్చితంగా అని పవన్ కళ్యాణ్ అనుకుంటే తాము అమలు చేసిన సంక్షేమం సామాజిక సమీకరణలు కలిసి వస్తాయని వైసిపి ప్రభుత్వం అంచనా వేస్తోంది.
Advertisement
Also read:
Also read:
ఈరోజు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్ మీద జగన్ కొత్త స్కెచ్ సిద్ధం చేశారు రాత్రి తాను ఉన్న ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ పరిధిలోని అభ్యర్థులతో జగన్ ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నేతల మధ్య సమన్వయం పైన కీలక సూచనలు చేయబోతున్నారు. 25 తర్వాత జగన్ ప్రతీ రోజు మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ చేశారు. తణుకు రావులపాలెం జొన్నాడ మీదుగా జగన్ బస్సు యాత్ర గోదావరి జిల్లాలో కొనసాగింది రావులపాలెం సెంటర్ లో భారీగా జనస్పందన కనపడింది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!