Advertisement
నందమూరి తారకరత్న మరణ వార్త రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కలచివేస్తుంది. తారకరత్న ఫిబ్రవరి 18 శనివారం రోజు రాత్రి 9:40 గంటల ప్రాంతంలో బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఇక బెంగళూరుల నుండి హైదరాబాద్ లోని మోకిలాకు నందమూరి తారకరత్న పార్థివదేహాన్ని తరలించారు. మోకిలాకి చేరుకున్న నందమూరి కుటుంబ సభ్యులు, తారకరత్న పార్థివ దేహానికి కృతువు పూర్తి చేశారు. అయితే తారకరత్న విజయసాయిరెడ్డి చెల్లెలు కూతురు అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఇంట్లో ఎవరికి ఇష్టం లేదని మొదటి నుండి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ వార్తని నమ్మే వాళ్ళు ఉన్నారు, కేవలం రూమర్స్ మాత్రమే అని కొట్టి పారేసే వాళ్లు కూడా ఉన్నారు. అయితే తారకరత్న ఇంటి వద్ద ఆయన పార్థివ దేహాన్ని తీసుకొని వచ్చినప్పుడు చోటు చేసుకున్న కొన్ని సంఘటనలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయంగా మారాయి.
Advertisement
Read also: అల్లు అర్జున్ కోసం రాజమౌళితో అల్లు అరవింద్ ఎందుకు గొడవపడ్డాడు ? ఆ సినిమా తెచ్చిన గొడవ ?
Advertisement
39 ఏళ్లకే మరణించిన తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు తారకరత్న ఎంతో మంచివాడని, అతని మరణం బాధాకరమని మాట్లాడుకున్నారు. ఇంత మంచి వ్యక్తి మరణిస్తే, ప్రతి ఒక్కరిని అతని మరణం బాధిస్తూ ఉంటే తారకరత్న తల్లిదండ్రులు మాత్రం మృతదేహాన్ని చూసేందుకు మోకిలకి కూడా రాలేదు. కొడుకు సొంత ఇంటికి రాకుండా తారకరత్న పార్థివదేహాన్ని ఫిలిం చాంబర్ కి తరలించిన తర్వాత తల్లిదండ్రులు రావడానికి కారణం ఏంటి? అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. నందమూరి అభిమానులు అయితే వాళ్లు తారకరత్న ఇంటికి వచ్చారు అని అంటుంటే.. మెజారిటీ నేటిజన్స్ మాత్రం తారకరత్న తల్లిదండ్రులు కొడుకు సొంత ఇంటికి రాలేదని, ఫిలిం ఛాంబర్ కే నేరుగా చూడడానికి వచ్చారని చెబుతున్నారు.
తారకరత్నని చివరి చూపు చూడడానికి తల్లిదండ్రులు తారకరత్న సొంత ఇంటికి వెళ్లక పోవడానికి ప్రధాన కారణం తారకరత్న ఉంటున్న ఇల్లు అలేఖ్య రెడ్డిది అని, ఆ ఇల్లు కోడలిది కావడంతో కోడలితో అత్తమామలకు ఉన్న విభేదాల కారణంగానే వాళ్ళు ఆ ఇంటి గడప తొక్కడానికి ఇష్టపడక చివరికి కొడుకు చనిపోయిన కూడా ఆ ఇంటికి వెళ్లలేదట. ఆ తర్వాత ఫిలిం ఛాంబర్ కి తారకరత్న భౌతికదేహాన్ని తరలించాక అక్కడికి వచ్చి వెక్కివెక్కి ఏడ్చారు. ఈ విషయంలో చాలామంది నెటిజన్స్ తారకరత్న తల్లిదండ్రులను తిట్టిపోస్తున్నారు. కోడలు పేరు మీద ఉన్న ఇంట్లోకి వెళ్లలేదు అని, అలాంటిది వారి పిల్లలను వీళ్ళు ఎలా చూసుకుంటారు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ విషయంలో బాలకృష్ణ అలేఖ్య రెడ్డికి భరోసా ఇచ్చారు. తారకరత్న చనిపోయినా కూడా మీ బాధ్యతలు పూర్తిగా నావే అని చెప్పారు. ఆ సమయంలో బాలకృష్ణ చెప్పిన మాటలకు అలేఖ్య రెడ్డికి కాస్త ప్రాణం లేచి వచ్చింది.
Read also: ఎన్టీఆర్ మరణానికి, తారకరత్న మరణానికి ఇద్దరిలో ఉన్న కామన్ పాయింట్స్ గమనించారా?