Advertisement
సాధారణంగా హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు పురాతన కాలం నుంచి వస్తున్నాయి. సనాతన ధర్మం ప్రకారం.. మనం ఆచరించే నియమాలు, విశ్వసించే నమ్మకాల వెనుక సైన్స్ కూడా దాగి ఉంది. అందుకే చాలా మంది ఆచారాలను పాటిస్తున్నారు. కానీ కొందరూ టెక్నాలజీ కాలంలో ఆచారాలు ఏంటి అని కొట్టి పారేస్తున్నారు కొంతమంది. మరికొంత మంది మాత్రం ఇప్పటికీ ఆచారాలు, విశ్వాసాలను పాటిస్తున్నారు.
Advertisement
ఇంటి గడపపై కాళ్లు పెట్టకూడదు. ఒక వేళ కాళ్లు పెట్టినట్టయితే మొక్కుకోవాలి. నల్లపిల్లి ఎదురైతే కీడు జరుగుతుంది. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తుమ్మడం అపశకునం. ఇలా ఎన్నో నమ్మకాల గురించి మన ఇళ్లలో నిత్యం వింటూనే ఉంటాం. వీటిని కొందరూ మూఢనమ్మకాలు అని కొట్టి పారిస్తే.. మరికొందరూ ఇప్పటికీ తూచ తప్పకుండా పాటిస్తుంటారు. వీటి వెనుక ఎంతో సైన్స్ దాగి ఉంటుందన్నది సత్యం. అలాంటిదే ఓ నమ్మకం ఉంది. భర్త తన భార్యకు ప్రతిరోజూ మల్లెపూలు తీసుకెళ్లడం. మీరు చదివింది అక్షరాల సత్యమే. ఇంతకు ప్రతిరోజూ భార్యకు భర్త మల్లెపూలు తీసుకెళ్లడం వల్ల ఏం జరుగుతుందంటే..? దాని వల్ల కలిగే ప్రతిఫలం ఏంటో తెలుసుకుందాం.
Advertisement
ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. నిజమే ఇంట్లో ఆడవారు ఉంటే ఆ కళే వేరు. అలాంటి ఆడవారు ఎప్పుడూ సంతోషంగా ఉంటే ఆ కుటుంబమే సంతోషంగా ఉంటుంది. ఆడవాళ్లు ఎంత ఒద్దిగగా.. అందంగా, ఆనందంగా సంసారాన్ని సాగిస్తే ఆ ఇంట్లో వారి జీవితమంతా ఆనందంగా ఉంటుంది. మనిషిని వేధించే సమస్యల్లో ఆర్థిక సమస్య ఒకటి. ఆర్థిక సమస్యలు దూరం కావాలంటే ముందు మీ ఇంటివారిని సంతోషంగా ఉంచండి. మగవారు రోజు భార్యకు మూరెడు మల్లెపూలను కొని తీసుకెళ్తే చాలా మంచిది అట. మీకు ఉద్యోగంలో వ్యాపారంలో తగినంత సంపాదన లేకపోతే ప్రతీరోజు ఆమె తలలో మల్లెపూలు సింగారించుకంటే శుక్రుడు అనుగ్రహిస్తాడట. పరిమళ భరితమైన జాజి, విరజాజి పూలు కూడా ఇవ్వవచ్చు. ఇవి ఇవ్వడం వల్ల శుక్రుడు అనుగ్రహిస్తే.. ఉద్యోగ, వ్యాపారాలు కలిసి వచ్చి సంపద కలుగుతుందని శాస్త్రాలు చెెబుతున్నాయి. పురుషులు ఈ చిన్న చిట్కాను పాటిస్తే శుక్రుని అనుగ్రహం పొంది తద్వారా వ్యాపార, ఉద్యోగ రంగాల్లో రాణించవచ్చు. ఆర్థిక సమస్యలను అధిగమించవచ్చు.
Also Read :
చాణక్య నీతి ప్రకారం ఈ 3 పనులు చేసుక తప్పక స్నానం చేయాలట ..! లేకుంటే ..!