Advertisement
Best husband qualities: పెళ్లయిన తర్వాత భార్యాభర్త (Marital life) సంతోషంగా ఉండాలని అనుకుంటారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మార్పు వస్తుంది. పెళ్లి అనేది జన్మజన్మల బంధం అని అంటారు. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిర్ణయించబడతారని అంటారు. పెళ్లి సంబంధం ఏడాది వరకు అందరికీ బానే ఉంటుంది కానీ నెమ్మదిగా కష్టాలు అనేవి మొదలవుతూ ఉంటాయి. వాటిని దాటుకుని వెళ్తే బంధం బాగుంటుంది. లేదంటే బంధం రెండు ముక్కలైపోతుంది. విడిపోవాలని అనుకుంటుంటారు. చాలామంది ఈరోజుల్లో పెళ్లయిన తర్వాత కొంతకాలం ఆనందంగా ఉంది. ఆ తర్వాత విడాకులు తీసుకొని విడిపోతున్నారు. అయితే భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకోవాలి.
Advertisement
అలానే ఒకరినొకరు గౌరవించుకోవాలి. భార్యలు భర్తల్లో ఈ లక్షణాలు ఉండాలని కోరుకుంటుంటారు. మరి అవి ఏంటో చూద్దాం..
Advertisement
- భర్తలో భార్య కోరుకునే మొదట లక్షణం ఏంటంటే అర్థం చేసుకోవాలి. ఎక్కువ అహంకారం చూపించకుండా భర్త తనని అర్థం చేసుకుంటే బాగుంటుందని భార్యలు కోరుకుంటారు.
- అలానే చాలామంది భార్యలు భర్త సర్ప్రైజ్ ఇస్తే బాగుండని ఇష్టపడుతూ ఉంటారు. తమ భర్తలు తమ ని సర్ఫరైజ్ చేయాలని భార్యలు అనుకుంటారు. వాళ్ళకి నచ్చింది ఏదో తెలుసుకుని అడగకుండా భర్తలు తీసుకురావాలని కోరుకుంటారు భార్యలు.
- అలానే భర్త నిజాయితీగా ఉండాలని కూడా కోరుకుంటారు ఏదైనా తప్పు చేసిన దానిని తమ ముందు ఒప్పుకోవాలని కోరుకుంటారు. ఆ విషయంలో మొదట భార్య బాధపడిన తర్వాత నిజాయితీగా ఉన్నారని అంగీకరిస్తుంది. అబద్ధాలు చెప్పడం కంటే నిజాయితీగా ఉండి భార్యను ప్రేమిస్తే బాగుంటుందని భార్యలు కోరుకుంటారు. ప్రతి మనిషికి కూడా కష్టాలు ఉంటాయి.
- భార్యలు తమ కష్టాలని తాము చెప్పక ముందే భర్త తెలుసుకోవాలని ఆశిస్తారు ఏ ఇద్దరికీ కూడా ఒకే రకమైన అభిప్రాయాలు ఉండవు. భార్యా భర్తల్లో కూడా అంతే. తన అభిప్రాయానికి భర్త విలువ ఇవ్వాలని భార్యలు కోరుకుంటారు. భర్త అభిప్రాయాన్ని తమ మీద రుద్దకుండా ఉండాలని భార్యలు ఆశిస్తారు ఇలా ఈ లక్షణాలు భర్తలో ఉండాలని భార్య అనుకుంటుంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!