Advertisement
సొంత వాళ్లనే చంపుకోవడం, ఎందులోనో అడ్డురావడంతో దేనికైనా తెగించడం వంటివి మనం చూస్తూనే ఉంటాం. తాజాగా కట్టుకున్న భర్తనే ఒక ఆమె దారుణంగా చంపేసింది. వివరాలు చూస్తే.. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మహిళా దరణ హత్య కి గురైంది. సూరారం విశ్వకర్మ కాలనీ కి చెందిన సురేష్ తో రేణుకకు పెళ్లి అయ్యింది. వీళ్ళ పెళ్లి అయ్యి ఏడు ఏళ్ళు అయింది. వీళ్ళకి పిల్లలు కూడా వున్నారు. కుటుంబ కలహాల కారణంగా భర్త సురేష్ తో విడిపోయి ఉంటోంది రేణుక. కానీ ఆమె దుండిగల్ లోని ప్రైవేటు స్కూల్ లో వాచ్మెన్ గా పనిచేస్తున్న సాయిబాబాతో సహజీవనం చేస్తోంది.
Advertisement
Advertisement
ఇది తెలిసి సురేష్ రేణుకను మందలించాడు. సురేష్ అడ్డు తొలగించుకోవాలని భావించిన రేణుక ఫిబ్రవరి 6న మరో మహిళతో కలిసి భర్త సురేష్ ని హత్య చేసింది. రేణుక ఇటీవల బెయిల్ మీద తిరిగి వచ్చేసింది. ఈమె పోలీస్ స్టేషన్లో సంతకం పెట్టి ఇంటికి వెళ్ళింది. ఆ తరవాత పని మీద మళ్ళీ ఆమె తిరిగి వచ్చింది. అప్పుడు రేణుకను బంధం చెరువు కట్టపై హత్య చేశారు. అది హత్య అని తేల్చారు పోలీసులు. రేణుక మొబైల్ ఫోన్ ని చూడగా చివరి ఫోన్ కాల్ సురేష్ తమ్ముడు నరేష్ ది అయ్యి వుంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ మార్చురీ కి తరలించారు.
Also read:
- ప్రపంచంలో అత్యధిక హిందూ జనాభా ఉన్న.. 10 దేశాలు ఇవే..!
- సన్యాసులుగా క్రికెటర్లు.. AI రూపొందించిన ఫొటోస్ వైరల్..!
- గవర్నర్ రాజ్ భవన్ మెను నుంచి టమాట మాయం.. అందుకోసమేనా ?