Advertisement
మగవాళ్ళు అన్ని విషయాలని స్ట్రైట్ గా చెప్తారు. కానీ, ఆడవాళ్లు మాత్రం స్ట్రెయిట్ గా ఏ విషయాలను కూడా చెప్పరు. కొంచెం ఇండైరెక్ట్ గా చెప్తూ ఉంటారు. ఇన్ డైరెక్టుగా ఆడవాళ్లు చెప్తే వాటిని మగవాళ్ళు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే, ఆడవాళ్లు ఏదైనా విషయంలో మాట్లాడినప్పుడు ఏమైనా అడిగితే ఏమీ లేదు అని చెప్పినట్లయితే, మీరు అలా వదిలేయొద్దు. అక్కడ కొంచెం మీరు ఆలోచించుకోవాలి. ఏమీ లేదు అంటే కచ్చితంగా ఏదో ఉందని మీరు అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఏమీ లేదు అని చెప్పినట్లయితే మీరు కచ్చితంగా ఏదో ఉందని తెలుసుకుని దానిని పరిష్కరించండి.
Advertisement
ఎప్పుడైనా కూడా ఆడవాళ్లు మీ ఇష్టం అని చెప్తే మీరు మీకు నచ్చినట్లు చేయొద్దు. అక్కడ మీ ఇష్టం అని చెప్తే, ఆసక్తి వారికి లేదని మీరు అర్థం చేసుకోవాలి. అలానే కొన్ని కొన్ని సార్లు ఆడవాళ్లు సర్లే అని అంటూ ఉంటారు సర్లే అంటే మీరు చెప్పిన దానికి ఒప్పుకున్నట్లు కాదు. సర్లే అని, కోపం గా విసుగ్గా చెప్పినట్లయితే వాళ్లకి కోపం తగ్గలేదని అర్థం చేసుకోవాలి. వారి కోపాన్ని మెల్లిమెల్లిగా తగ్గించడానికి ట్రై చేయాలి.
Advertisement
అదే విధంగా ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడే ఆడవాళ్లు సైలెంట్ గా ఉన్నట్లయితే మనసులో ఏదో బాధ పడుతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. ఆ బాధని మీరు తెలుసుకోవడానికి ట్రై చేయాలి. వాళ్ళు సైలెంట్ గా ఉన్నట్లయితే కచ్చితంగా ఏదో సమస్య వస్తుందని మీరు గుర్తు పెట్టుకోవాలి. కాబట్టి ఇటువంటివి కనుక ఆడవాళ్లు చెప్పినట్లయితే అర్థం చేసుకుని, దానికి తగ్గట్టుగా మీరు అనుసరించాలి. లేదంటే కచ్చితంగా వాళ్ళు ఫీలవుతారు వాళ్ళని మళ్లీ బాధ పెట్టినట్టు అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా ఆడవాళ్లు ఇలా చెప్పినట్లయితే వాళ్ళని మీరు అర్థం చేసుకొని వారికి తగ్గట్టుగా అనుసరించడం మంచిది.
తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!