Advertisement
ప్రేమించడం చాలా ఈజీ కానీ ఆ ప్రేమలో సక్సెస్ అవ్వడం చాలా కష్టం. అందరూ ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని ఆనందంగా గడపలేరు. నిజానికి సరైన వ్యక్తిని ప్రేమించకపోవడం కూడా మనం చేసే పెద్ద తప్పే. ఒక రియాలిటీ స్టోరీని ఈరోజు మనం చూసేద్దాం… ”అతను నాకు చాలా మంచి ఫ్రెండ్ మేమిద్దరం కూడా ఎప్పుడు కలిసి ఆటలు ఆడుకునే వాళ్ళం. కలిసి మామిడి తోటలో దొంగతనాలు చేసే వాళ్ళం చెరువులో ఈత కొట్టే వాళ్ళం… ఇలా మా మధ్య మంచి స్నేహం ఉండేది. అయితే ఆ స్నేహం కాస్త ప్రేమగా మారింది.
Advertisement
ఈ విషయం మా ఇంట్లో తెలిసిపోయాక మా నాన్న అన్నయ్య నన్ను కొట్టారు కొట్టినప్పుడు కంటే ఇప్పుడు ఇంకాస్త ప్రేమ పెరిగింది. ఊరు వదిలి మేమిద్దరం పారిపోయాము ఒక పెద్ద టౌన్ కి వచ్చి చిన్న రూమ్ ని అద్దెకి తీసుకుని అక్కడి కొత్త జీవితాన్ని మొదలు పెట్టాము. నా ప్రియుడు టెక్స్టైల్ కంపెనీ లో జాబ్ చేసేవాడు. నేను ఇంటి చుట్టుపక్కల ఉండే ఇళ్లల్లో సామాన్లు తోమేడాన్ని. చిన్న ఇంట్లో ఉన్నా కూడా మా మధ్య ఎంతో ప్రేమ ఉండేది.
ఒక్కొక్కసారి ఆయన నైట్ డ్యూటీ కూడా చేసేవారు ఆ టైంలో నేను ఆయన కోసం బాగా ఎదురు చూసే దాన్ని. ఇంకాస్త ప్రేమ పెరిగింది. ఓ రోజు సాయంత్రం నేను ఇంట్లో ఉన్నప్పుడు మా ఆయనతో పాటు టెక్స్టైల్ కంపెనీలో పని చేసే మరొక వ్యక్తి నా దగ్గరికి వచ్చాడు కంపెనీలో పని చేసే ఒక అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నాడని నాతో చెప్పాడు. కంపెనీకి దగ్గరలోకి ఇల్లు ని కూడా అద్దెకి తీసుకున్నారని చెప్పాడు. అతను చెప్పింది అబద్ధమని నాకు అనిపించింది.
Advertisement
దాని వెనుక కారణం ఏమిటంటే మా మధ్య ప్రేమ స్వచ్ఛమైనది అందుకే. అతని మాటల్ని అబద్ధమని నిరూపించడానికి అతనితో పాటుగా నేను వెళ్ళాను. అతను దూరంగా ఒక ఇల్లుని చూపించాడు అక్కడే మీ ఆయన ఒక అమ్మాయి తో పాటు ఉంటున్నాడని ఆయన చెప్పాడు. కొంచెం సేపటికి మా ఆయన ఇంకో అమ్మాయి తో కలిసి ఒక సంచి పట్టుకుని ఆ ఇంటికి వెళ్లడాన్ని చూసాను అక్కడ నేను ఉండలేకపోయాను. ఇంటికి ఎలా వచ్చాను అనేది కూడా నాకు తెలియదు నా మనసుని రాయి చేసుకున్నాను. ఇంతలో మా ఆయన ఇంటికి వచ్చారు.
ముఖం కాళ్లు చేతులు కడుక్కుని అన్నం వడ్డించమన్నారు. ఆ రోజు చేపల కూర చేశాను. చాలా బాగుందన్నారు నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని నేను ఆయన్ని అడిగాను. నేను ఇంకేమి ఆలోచించకుండానే ఒంటి మీద ఉన్న చీరతోనే బయటికి వచ్చేసాను నన్ను బతిమాలాడు అయినా కూడా నేను అక్కడ ఉండలేదు. మరో అవకాశాన్ని ఆయనకి ఇవ్వాలని నేను అనుకోలేదు. ఇప్పటికి 15 సంవత్సరాలయింది నా బతుకు ఏదో నేను బతుకుతున్నది తప్ప మళ్ళీ అతని దగ్గరికి వెళ్ళలేదు నా వాళ్ళు ఎవరూ లేరు నేను ఇప్పుడు ఒక అనాధని అలానే జీవితాన్ని గడుపుతున్నా”..
Also read:
”నిండుగా కప్పుకున్నా.. అయినా కూడా ఆ చూపులు”… ఈ మహిళా బాధని చూస్తే కంటతడి పెట్టుకుంటారు..!
నా పర్సు కొట్టేసిన దొంగే నా మనసుని కూడా… అసలు ఏం జరిగింది అంటే..?