Advertisement
ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ ఏడాది ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమ్మలో అధికారంలో ఉన్న వైసీపీ పార్టీని ఎదిరించడానికి అన్ని పార్టీలు గట్టిగానే పోరాడుతున్నట్లు ఉన్నాయి. ఇప్పటికే జనసేన, తెలుగు దేశం పార్టీలు కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మరో వైపు కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో జగన్ సోదరి షర్మిలను ఏపీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోనున్నారని తెలుస్తోంది. ఆమెకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగిస్తారు అని వార్తలు వైరల్ అవుతున్నాయి.
Advertisement
ఇక అధికార వైసీపీ పార్టీలో అసంతృప్తితో ఉన్న రాజకీయ నాయకులు కూడా కాంగ్రెస్ లోకి చేరే అవకాశం ఉందని వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలో ప్రతిపక్ష పార్టీ బలం పెరుగుతోందని చెప్పవచ్చు. వై ఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైనట్లే. రాబోయే ఎన్నికల్లో వై ఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కడప బరిలోకి షర్మిల దిగితే.. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి అడుగులు ఎటువైపు వేస్తారో చూడాలి.
Advertisement
కడప పార్లమెంట్ స్థానం వై ఎస్ కుటుంబానికి బలమైన స్థానం. వై ఎస్ ఆర్, వివేకానంద రెడ్డి ల తరువాత జగన్, వై ఎస్ అవినాష్ రెడ్డి లు ఈ స్థానం నుంచి కడప ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు. ప్రస్తుతం వై ఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. ఈసారి ఆయనను కడప ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అవినాష్ రెడ్డి ని జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయిస్తారని వార్తలు వస్తున్నాయి. కడప ఎంపీ పార్లమెంట్ స్థానం నుంచి వై ఎస్ భారతి పోటీ చేస్తారా? అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతున్నాయి.
Read More:
తీన్మార్ మల్లన్న సినిమాల్లో నటించారా..? కామెడీ సీన్స్ వైరల్…!
అచ్చం ఐశ్వర్యరాయ్ లాగే ఉన్న ఈ 6 మంది ఎవరు..? ఆమె చెల్లెళ్ళు మాత్రం కాదు..!