Advertisement
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే.. సిబిఎన్ అరెస్ట్ తో రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే.. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది అన్న విషయంలో కూడా లెక్కలు మారాయి. సిబిఎన్ ను బయటకు తీసుకొచ్చే పనిలో టీడీపీ పడిపోతే.. వైసీపీ మాత్రం నడిరోడ్లపై ప్రచారం చేసుకునే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. సిబిఎన్ జైలుకు వెళ్లి నెల రోజులు అవుతోంది.
Advertisement
అయితే.. యాదృచ్చికంగా.. ఆయన జైలుకి వెళ్లిన నెల రోజులు పూర్తి అయ్యిన రోజే వైసీపీ ప్రభుత్వం ఓ బహిరంగ సభను నిర్వహించింది. మండల స్థాయి నుంచి.. మంత్రి స్థాయి వరకు అందరు వైసీపీ నేతలతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఎన్నికల దిశగా ఎలాంటి అడుగులు వెయ్యాలో ఈ సభలో చర్చించారు. ఈ నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ ప్రారంభించిన ఏ సంక్షేమ పధకానికి ఈ స్థాయిలో బహిరంగ సభలు జరగలేదు. ఈ సమావేశంలో దాదాపు 90 రోజుల షెడ్యూల్ ను సీఎం జగన్ ప్రకటించారు.
Advertisement
ఇందులో భాగంగానే జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని సెప్టెంబర 30న ప్రారంభించారు. ఇది నవంబర్ 10 వరకు జరగనుంది. ఈ కార్యక్రమంలో మెడికల్ కాంపులని నిర్వహిస్తూ.. రాష్ట్రము లోని అందరు కుటుంబాల వద్దకు వైద్య సహాయం తీసుకెళ్లనున్నారు. మొత్తం రాష్ట్రంలో 15,500సచివాలయాల పరిధిలో 15వేల క్యాంపుల నిర్వహణకు ఏర్పాట్లు చేసారు. డాక్టర్లు, వాలంటీర్లు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, స్పెషలిస్ట్స్, ఫ్యామిలీ డాక్టర్స్, ఆశ వర్కర్స్ ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. ఇవే కాకుండా “ఏపీకి జగన్ ఎందుకు కావాలి?”, బస్సు యాత్రలు, ” ఆడుదాం ఆంధ్ర” పేరుతొ కార్యక్రమాలు జరగనున్నాయి. వీటన్నిటిలో ప్రజలు భాగస్వామ్యం కానున్నారు. సాధారణంగా ఉండే ప్రచారానికి భిన్నంగా.. ప్రజలతో ముడిపడి ఉండే ఈ కార్యక్రమాలతో వినూత్నంగా ప్రచారం చేయాలనీ వైసీపీ భావిస్తోంది. మరోవైపు సిబిఎన్ జైలుకు వెళ్లి నెల దాటింది. ఒకవేళ బెయిల్ పై ఆయన బయటకు వచ్చినా.. మరో మూడు కేసులకు సంబంధించి సమస్యలు ఎదురుకానున్నాయి.
మరిన్ని..
ఒకవేళ చంద్రబాబు నాయుడు బెయిల్ పై విడుదల అయినా.. తర్వాత ఏమి జరుగుతుందంటే?