Advertisement
రజినీకాంత్ ఇటీవల విజయవాడలో జరిగిన ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు హాజరైన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ని ప్రశంసించడంతో పాటు ఆయనతో ఉన్న తమ అనుబంధాన్ని నెమరు వేసుకున్నాడు. అలాగే మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మీద ప్రశంసల జల్లు కూడా కురిపించాడు. అయితే చంద్రబాబుని పొగడటంతో అధికారిక పార్టీ నాయకులు రజినీకాంత్ పై ఫైర్ అయ్యారు. ఆయన గురించి అత్యంత నీచంగా మాట్లాడారు.
Advertisement
READ ALSO : Allari Naresh Ugram Movie Review in Telugu: అల్లరి నరేష్ “ఉగ్రం” ఫస్ట్ రివ్యూ
దీనిని రజిని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ విమర్శలు ఏ స్థాయికి వెళ్ళాయంటే సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కారణం అనే వరకు. అవును ఇది నిజం అనేలా గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ లేఖ చక్కర్లు కొడుతోంది.
లేఖను ఒకసారి పరిశీలిస్తే…!
Advertisement
“ఏడేళ్ల వయసు నుంచే పోట్టకూటి కోసం కష్టపడ్డాను. నేను అందరికీ మంచి చేసిన నాకు మాత్రం చెడు జరిగింది. నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారు. బాబు తప్ప అందరూ నా కష్టం తిన్నవారే. నా సొమ్ము తిన్న వారు నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. ఐదేళ్ల క్రితం ఒకడు నాకు జీవితం ఇస్తానన్నారు.
కానీ ఇప్పుడు దూరమయ్యాడు. రాము, రాధాకృష్ణ అనే వ్యక్తులు నన్ను నమ్మించి మోసం చేశారు. ప్రతి ఒక్కడు నా రెక్కల కష్టం తిన్నవాడే. రోజు టార్చర్ అనుభవించాను. ఈ బాధ భరించలేకపోతున్నాను… దేవుడనే వాడుంటే, నన్ను మోసం చేసిన వారిని శిక్షిస్తాడు” అని రాసకొచ్చింది. అయితే సిల్క్ స్మిత ఆత్మహత్యకు రజనీకాంత్ కారణం అని అర్థం వచ్చేలా పలువురు వైసిపి శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీనిపై రజినీ ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. ఇంత నీచంగా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు.
READ ALSO : సోమ, మంగళ, గురు, శనివారాల్లో మాంసాహారం తినకూడదా ? అసలు మంచిది కాదా….?