Advertisement
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పిరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వతంత్ర సమరయోధులు అయిన కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్రలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆకట్టుకున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లోనే కాకుండా అంతర్జాతీయ వేదికగా ఎన్నో అవార్డులను సైతం దక్కించుకుంది. ఇటీవల గోల్డెన్ గ్లోబ్ అవార్డును సైతం సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆస్కార్ అవార్డు కోసం ఎదురుచేస్తుంది.
Advertisement
Advertisement
అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రూపొందించేందుకు తనకు స్ఫూర్తినిచ్చిన రెండు సినిమాల గురించి చెప్పకొచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ చేయడానికి తెలుగు ఐకానిక్ మూవీ మాయాబజార్ సినిమా తనకు ఎంతో నమ్మకం ఇచ్చిందని, అలాగే మెల్ గిబ్సన్.. బ్రేవ్ హార్ట్ కూడా తనకు స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. ఎన్టీఆర్ కొమురం భీముడో పాటకు మెల్ గిప్సన్ బ్రేవ్ హార్ట్ స్ఫూర్తినిచ్చిందని అన్నారు. RRR చిత్రంలోని భీమ్ పాటలో అతడిని కొరడాతో కొట్టే సన్నివేశానికి ప్రేరణ అదే అంటూ చెప్పుకొచ్చారు. కొమురం భీముడో పాట వింటే రోమాలు నిక్కబొడుచుకుంటాయనేది వాస్తవం.
సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను కీరవాణి స్వరపరిచారు. ఆయన కొడుకు కాలభైరవ ఈ పాటని ప్రాణం పెట్టి పాడారు. ఈ పాటకు తగ్గ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, ఫీల్ ను పీక్స్ కి తీసుకువెళ్లాడు ఎన్టీఆర్. ఈ పాటలో అద్భుతమైన పదాలను వాడుతూ.. కొమురం భీమ్ తెగువను చాటారు రైటర్. కొర్రాయి, నెగడు, కాల్మోక్త భాంచేన్ ఇలాంటి పదాలతో ప్రత్యేకత చూపించారు. అలాగే ఆర్ఆర్ఆర్ చిత్రంలోని కొమురం భీమడో పాటలో ఎన్టీఆర్ ను కొరడాతో కొట్టేందుకు మెల్ గిబ్సన్.. బ్రేవ్ హార్ట్ కూడా తనకు స్ఫూర్తినిచ్చాయని రాజమౌళి తెలిపారు.
Read also: సూపర్ స్టార్ మహేష్ భార్య సతీమణి నమ్రత ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇదేనా ? అస్సలు నమ్మలేరు !