Advertisement
మన దేశంలో అనాదిగా స్త్రీ అవమానాలకు, చిత్రహింసలకు, దోపిడీకి బలవుతున్న సంఘటనలు కోకొల్లలు. స్త్రీల పైన హింస రోజుకి పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసినా.. న్యాయవ్యవస్థ బాధితులకు అండగా నిలబడుతున్నా.. హింసకు గురయ్యే వారి సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా అత్తింట్లో వివిధ రకాల వేధింపులకు మహిళలు గురవుతున్నారు. అందుకే వారికి వేధింపుల నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చట్టాలు తీసుకువచ్చాయి. దీంతో ఎందరో మహిళలు వేధింపులకు గురి చేస్తున్న భర్తలపై ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. మహిళలకు రక్షణ కల్పించే చట్టాలు చాలా కఠినంగా ఉంటాయని విషయం మనకు తెలిసిందే.
Advertisement
అయితే ఈ కేసులని ఆసరాగా చేసుకొని కొందరు తప్పుడు కేసులు కూడా పెడుతున్నారు. భార్యాభర్తలలో ఎవరైనా సరే ఒకరి మీద మరొకరు తప్పుడు కేసులు పెట్టుకుంటే, అవి తప్పుడు కేసులు అని నిర్ధారించబడితే, బాధితులకు తమ జీవిత భాగస్వాముల నుండి విడాకులు కోరే హక్కు కల్పించేలా చట్ట సవరణలు చేయాలని లా కమిషన్ 18 ఏళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఎంతోమంది మహిళలు అత్తమామల నుంచి వేధింపులు ఎదుర్కొంటున్నారు. అందుకే చట్టాలు వారికి అనుకూలంగా ఉంటాయి. అయితే వీటిని ఆసరాగా చేసుకుని తాజాగా ఓ మహిళ కూడా అలాంటి పనే చేసింది. ఒక్క కేసు కాదు.. ఒక మహిళ ఎన్ని రకాల కేసులు పెట్టగలదో.. అన్ని అవకాశాలు ఉన్న కేసులను భర్తపై పెట్టింది.
Advertisement
అలా భర్తను వివిధ కేసులలో ఇరికించి కోర్టు చుట్టూ తిరిగేలా చేసింది. ఇలా భర్త పై కేసులు పెట్టి హింసించిన సదరు మహిళ చేసిన ఓ పనికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కొన్ని రోజుల క్రితం ఓయో హోటల్ రూమ్ లో పరాయి వ్యక్తితో పట్టుబడింది ఆ మహిళ. పరాయి వ్యక్తితో ఒంటరిగా ఉండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఆమె బండారం బయటపడింది. దీంతో అప్పటివరకు భర్త విషయంలో ఆమె చెప్పిన మాటలు నమ్మిన స్థానికులు.. ఆమె చేసిన పనితో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా వేధింపులకు గురయ్యే మహిళలకు ఈ చట్టాలు మంచిదే కానీ.. ఆ చట్టాల్లోని రుసువులను వాడుకొని వేధిస్తున్న ఇలాంటి మహిళలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:
- వెంకటేష్ భార్య గురించి ఈ విషయాలు తెలుసా… ఆమె ఆస్తులు ఎంత అంటే!
- కనీసం ఒక్కసారైనా సందర్శించాల్సిన 10 మహాశివాలయాలు ఇవే..!!