Advertisement
సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సుర్ల హవా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆకర్షణీయమైన రీల్స్, వీడియోస్ తో వీరు తమ ఫాన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అలాగే.. కొత్త ఆడియన్స్ ని కూడా పెంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంతే కాదు.. కొన్ని బ్రాండ్స్ ని ప్రమోట్ చేసుకుంటూ డబ్బులు కూడా సంపాదిస్తారు. ప్రస్తుతం ఇన్ఫ్లుయెన్సుర్ అనేది కొందరికి ఓ ప్రొఫెషన్ గా మారింది కూడా. తాజాగా.. ఓ ఇన్ఫ్లుయెన్సుర్ తనకి ఎలాంటి లైఫ్ పార్ట్ నర్ కావాలో చెబుతూ పేపర్లో యాడ్ ఇచ్చారు.
Advertisement
ఇప్పుడు ఈ పేపర్ యాడ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ యాడ్ ను రియా అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ పెట్టారు. ఇది వరకటి రోజుల్లో పెళ్లిళ్ల పేరయ్యలు సంబంధాలు తీసుకొచ్చి చెప్పే తంతు ఉండేది కానీ, ఇప్పుడు అందరూ తమ పార్ట్ నర్స్ ని సోషల్ మీడియాలోనే వెతికేసుకుంటున్నారు. ఇక ఆన్లైన్ మాట్రిమోనియల్ సైట్స్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే పని లేదు. ప్రతి వ్యక్తికి తన లైఫ్ పార్ట్ నర్ ఇలా ఉండాలి.. అలా ఉండాలి అన్న ఆలోచనలు ఉంటాయి. ఇక ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ తన లైఫ్ పార్ట్ నర్ గురించి ఎలాంటి రిక్వైర్మెంట్లు పెట్టిందో ఇప్పుడు చూద్దాం.
Advertisement
ఆమె తనకు కాబోయే పార్ట్ నర్ కెమెరా ముందు భయపడేవాడిగా ఉండకూడదు అని పేర్కొంది. అలాగే తనకి లవ్ రీల్స్ చేయడం అంటే ఇష్టమని.. తన పార్ట్ నర్ కి కూడా అలాంటి రీల్స్ చేయడం పట్ల ఆసక్తి ఉండాలని ఆమె కోరారు. ఇంకో విచిత్రమైన కోరిక ఏంటంటే.. తన లైఫ్ పార్టనర్ అమెజాన్ మినీ టివిలో వచ్చే హాఫ్ లవ్, హాఫ్ అరేంజ్డ్ వెబ్ సిరీస్ ని చూసి ఉండాలని పేర్కొంది. అంతే కాదు.. తమ సోషల్ మీడియా కంటెంట్‌ను ఎడిట్ చేయడానికి “ప్రీమియర్ ప్రో”ని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉండాలని ఆమె పేర్కొంది. ఈ ఫన్నీ కోరికలను చూసి నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈ వెడ్డింగ్ యాడ్ చాలా త్వరగా వైరల్ అయిపొయింది.
మరిన్ని తెలుగు న్యూస్ కొరకు ఇటు చూడండి !