Advertisement
తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సంచనాలు సృష్టించిన డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి మూవీ ఎలాంటి బ్లాక్ బాస్టర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. దీనిలో నటించిన వారంతా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు పొందారు. ఇందులో ముఖ్యంగా ప్రభాస్ రానా స్టార్లుగా మారారు. వారి మార్కెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే బాహుబలి చిత్రంలో ఎన్నో కొత్త కొత్త వస్తువులను చూపించారు రాజమౌళి. ఇందులో మనకు తెలియని ఎన్నో ఉన్నాయి. అలా ఒక వస్తువు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. బాహుబలి చిత్రంలో యుద్ధం సీన్ల సమయంలో ఈ పరికరాన్ని మీరు చూసే ఉంటారు. శత్రువుల మీదికి భారీ గుండ్లను వదిలిపెట్టడానికి దీన్ని వాడారు.
Advertisement
అయితే దీన్ని కాటా ఫుల్ట్ అంటారు. అప్పటివరకు కత్తులు ఇతర వస్తువులతో సాగిన యుద్ధం వీటి రాకతో కొత్తగా టర్న్ అవుతుంది. ఈ యుద్ధ పరికరం సహాయంతోనే మగధ రాజైన అజాతశత్రు లిచ్చావి రాజ్యాన్ని సునాయాసంగా ఓడగొట్టాడు. అప్పటివరకు ప్రాచ్యాత్య దేశాలకే తెలిసిన ఈ కొత్త ఆయుధాన్ని మన దగ్గర పరిచయం చేశాడు అజాతశత్రు. పంగల కర్ర కాన్సెప్ట్ తో తయారుచేసిన ఈ పరికరంలో మొదట తాడును, ఆ తర్వాత ఎలాస్టిక్ ను, తర్వాత స్ట్రింగ్స్ ను ఉపయోగించి పెద్దపెద్ద బండారాళ్లను శత్రువుల పైకి విసిరేశాడు. దీంతో, శత్రుముకలు చెల్లాచెదరవుతాయి.
Advertisement
ఆ తర్వాత రాళ్లకు బదులు పేలుడు పదార్థాలు వాడారు. అంతేకాకుండా దూరంగా వలను ఏర్పాటు చేసి ఇందులో నుండి మనిషిని వలలోకి విసిరేస్తారు. జలాశయాల్లోకి కూడా వీటిలో కూర్చున్న మనుషులను విసిరేసేవారు. మొదట్లో దూరం అంచనా సరిగ్గా లేక కొందరు చనిపోయారు కూడా, అలా కొద్ది రోజుల తర్వాత దీన్ని వాడడమే మానేశారు. అయితే పూర్వకాలం చాలా మంది రాజుల విజయాల్లో కీలకపాత్ర పోషించిన ఈ పరికరం బాహుబలి సినిమాతో మనకు కనిపించింది.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు: