Advertisement
ఆహారం తీసుకునేటప్పుడు కూడా కొన్ని నియమాలను పాటించాలి. కొన్ని ఆహార పదార్దాలను తీసుకునేటప్పుడు చేసే పొరపాట్ల వలన ఆరోగ్యం పాడవుతుంది. ముఖ్యంగా ఈ ఆహార పదార్థాలను తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. మరి ఎటువంటి ఆహార పదార్థాలను తిన్నాక నీళ్లు తాగకూడదనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా నీళ్లు తాగాలి. తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదు. కొన్ని ఆహార పదార్థాల విషయంలో ఈ తప్పు అస్సలు చేయకూడదు. పుచ్చకాయలో ఉండే నీటి కంటెంట్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది.
Advertisement
పుచ్చకాయ తిన్న వెంటనే నీళ్లు తాగితే నీటి పదార్థాలు డైల్యూట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పుచ్చకాయ తిన్నాక నీళ్లు తాగొద్దు. అలాగే పాలు తీసుకునాక నీళ్లు తాగడం మంచిది కాదు. పాలల్లో పోషకాలు ఎక్కువ ఉంటాయి పాలు తాగడంతో శరీరానికి కావాల్సిన పోషక బలం లభిస్తుంది. పాలు తాగాక నీళ్ళు తాగడం, సిట్రస్ పండ్లు తినడం మంచిది కాదు. అరటిపండు తిన్న తర్వాత కూడా నీళ్లు తాగడం మంచిది కాదు.
Advertisement
Also read:
కమల పండ్లు తిన్నాక కూడా నీళ్లు తాగకూడదు. సిట్రస్ పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగడం వలన జీర్ణ సమస్యలు వస్తాయి. వేరుశెనగ తిన్నాక నీళ్ళు తాగితే అజీర్తి సమస్య కలుగుతుంది. నిమ్మకాయ నీళ్లు తాగాక లేదంటే లెమన్ సోడా తాగిన తర్వాత నీళ్లు తాగకూడదు. దోసకాయ తిన్నాక కూడా నీళ్లు తాగడం మంచిది కాదు. అదే విధంగా స్ట్రాబెర్రీస్ తీసుకున్నాక నీళ్లు తాగితే జీర్ణ సమస్యలు కలుగుతాయి. ముఖ్యంగా కడుపులో వికారం ఏర్పడుతుంది.
ఆరోగ్య చిట్కాల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!