• About
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
  • METHODOLOGY FOR FACT CHECKING
  • SOURCING INFORMATION

Telugu Action

Latest Telugu News Portal

follow on google news
  • Home
  • Off Beat
  • TS Politics
  • AP Politics
  • Movie News
  • Featured
  • Mythology
  • Sports
  • Health
  • Horoscope
  • OTT
Telugu News » Movie News » సంక్రాంతి కి పది సార్లకు పైగా పోటీపడ్డ చిరు-బాలయ్యలు ఎవరు గెలిచారు ? ఎవరిది పైచెయ్యి ?

సంక్రాంతి కి పది సార్లకు పైగా పోటీపడ్డ చిరు-బాలయ్యలు ఎవరు గెలిచారు ? ఎవరిది పైచెయ్యి ?

Published on January 12, 2023 by anji

Advertisement

మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణ.. ఈ ఇద్దరు హీరోలకి తెలుగు రాష్ట్రాలలో మాస్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇండస్ట్రీలో ఒక హీరో సినిమాతో మరో హీరో సినిమా పోటీ పడడం అనేది ఎప్పటినుంచో ఉంది. అందులో బాలకృష్ణ – చిరంజీవి సినిమాల పోటీ అంటే అభిమానులకు ఆ కిక్కే వేరు. ఈ నేపథ్యంలో ఈ సంక్రాంతికి కూడా చాలా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడేందుకు సిద్ధమయ్యాయి. ఈ సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీర సింహారెడ్డి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే, ఇలా గతంలోనూ మెగాస్టార్ చిరంజీవి, నటసింహ నందమూరి బాలకృష్ణల సినిమాలు పోటీ పడ్డాయి. ఆ సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.

Advertisement

# 1985: సంక్రాంతికి చిరంజీవి ‘చట్టంతో పోరాటం’ చిత్రంతో, బాలకృష్ణ ‘ఆత్మబలం’ చిత్రంతో పోటీపడ్డారు. అయితే ఈ రెండు సినిమాలు ఆడలేదు. కమర్షియల్ గా ‘చట్టంతో పోరాటం’ గుడ్డిలో మెల్ల అన్నట్టు నిలబడింది.

# 1987: ఈ ఏడాది సంక్రాంతి ‘దొంగ మొగుడు’తో చిరంజీవి, ‘భార్గవ రాముడు’తో బాలయ్య పోటీపడ్డారు. అయితే విన్నర్ గా చిరంజీవి ‘దొంగ మొగుడు’ నిలిచింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది.

# 1988: ఈ ఏడాది సంక్రాంతికి ‘మంచి దొంగ’ తో, బాలకృష్ణ ‘ఇన్స్పెక్టర్ ప్రతాప్’ తో పోటీ పడ్డారు. ఈసారి వీరిద్దరి సినిమాలు సక్సెస్ అందుకున్నాయి.

# 1997: ఈ ఏడాది చిరంజీవి ‘హిట్లర్’ తో, బాలకృష్ణ ‘పెద్దన్నయ్య’ తో పోటీపడ్డారు. ఈసారి కూడా ఇద్దరు సక్సెస్ సాధించారు. ఈ రెండు సినిమాల్లో బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.

Advertisement

# 1999: ఈ ఏడాది సంక్రాంతి చిరంజీవి ‘స్నేహం కోసం’ తో, బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’ తో పోటీపడ్డారు. ‘స్నేహం కోసం’ పెద్దగా ఆడలేదు. బాలయ్య ‘సమరసింహారెడ్డి’ మాత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

# 2000: ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘అన్నయ్య’ చిత్రంతో, బాలకృష్ణ ‘వంశోద్ధారకుడు’ చిత్రంతో పోటీపడ్డారు. ‘అన్నయ్య’ సినిమా హిట్ అయింది. ‘వంశోద్ధారకుడు’ ఫ్లాప్ గా మిగిలింది.

# 2001: ఈ ఏడాది సంక్రాంతి కి చిరంజీవి ‘మృగరాజు’ చిత్రంతో, బాలకృష్ణ ‘నరసింహనాయుడు’ చిత్రంతో పోటీ పడ్డారు. ‘నరసింహనాయుడు’ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ‘మృగరాజు’ డిజాస్టర్ అయ్యింది.

# 2004: ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘అంజి’ చిత్రంతో, బాలకృష్ణ ‘లక్ష్మీనరసింహ’ చిత్రంతో పోటీపడ్డారు. ‘అంజి’ డిజాస్టర్ గా మిగిలింది. ‘లక్ష్మీనరసింహ’ సూపర్ హిట్ గా నిలిచింది.

# 2017: ఈ ఏడాది సంక్రాంతికి చిరంజీవి ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రంతో, బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ చిత్రంతో పోటీపడ్డారు. ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ అయింది. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కూడా డీసెంట్ హిట్ అనిపించింది.

# 2023: ఈ ఏడాది సంక్రాంతికి చిరు ‘వాల్తేరు వీరయ్య’ తో, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ తో పోటీపడనున్నారు. మరి ఈసారి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

Read also: పెదరాయుడు సినిమాకి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటంటే ?

Related posts:

సౌందర్య చనిపోవడానికి ముందే ఆమె 3 ప్రమాదాలు జరిగాయట..? పవన్ కళ్యాణ్ ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటంటే..? చిరంజీవి నటించిన పసివాడి ప్రాణం సినిమాలో ఈ చిన్నారి ఎవరో..? ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..? విజయ్ “వారసుడు” ట్రైలర్ చూసారా ? మీకు ఇదే డౌట్ వచ్చిందా ?? ఇది అదే కదా ?

About anji

My name is Anji. I have been working as a editor in Teluguaction for the last one year and am experienced in writing articles in cinema, sports, flash news, and viral, and offbeat sections.

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Trending Topics

  • Salaar OTT
  • Upcoming Telugu Movies 2024
  • Love Quotes in Telugu
  • Best 50+ Telugu Quotes and Quotations
  • Wedding Anniversary in Wishes, Telugu

Advertisement

Latest Posts

  • కవిత గ్రహించిందా… కేటీఆర్ , హరీష్ రావుల సంగతేంటి?
  • రేవంత్ ను అంచనా వేయడంలో బీఆర్ఎస్ ఫెయిల్..ఇలాగైతే కష్టమే!
  • బండి సంజయ్ అంతే!?
  • అదే జరిగితే…కాంగ్రెస్ కు అద్దంకి గుడ్ బై!?
  • 48 గంటల్లో కేసీఆర్ , కేటీఆర్ , హరీష్ రావు అరెస్ట్ : సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Copyright © 2025 · Telugu Action | Latest Telugu News | Telugu Political News - Technology Maintenance by CultNerds IT Solutions Pvt Ltd