Advertisement
మనిషి బ్రతకడానికి గాలి, నీరు ఎంత అవసరమో.. ఆరోగ్యంగా ఉండడానికి పౌష్టిక ఆహరం కూడా అంతే అవసరం. ఏదో తిన్నాం అంటే.. తిన్నాం అన్నట్లు కాకుండా.. ఒంటికి పట్టె ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. మంచి ఆహారంతో పాటు శరీరానికి తగినంత వ్యాయామాన్ని అందించడం కూడా ముఖ్యం. తగినన్ని పోషకాలను అందించే ఆహారాలను ఎంచుకోవడం ముఖ్యం. ఈ ఆర్టికల్ లో మానవ మనుగడకు అవసరమయ్యే అన్ని పోషకాలు లభించే 25 ఆహార పదార్ధాలను అందిస్తున్నాం. అన్ని రకాల విటమిన్లు, ఖనిజ లవణాలు లభించే ఈ ఆహార పదార్ధాల లిస్ట్ ఓ లుక్ వేయండి.
Advertisement
గుమ్మడి:
ఇందులో బీటా కేరటిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది క్యాన్సర్ రిస్కును తగ్గించగలదు. గుమ్మడిలో విటమిన్ ‘ఏ’ మరియు విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీన్ని జ్యుస్ గా తాగచ్చు, పులుసు చేస్కోవచ్చు, కూర చేస్కోవచ్చు, సూప్ లాగ కూడా వండుకోవచ్చు.
టమాటో:
టమాటో లేని వంట ఉండదు. ఎన్ని స్పెషల్స్ చేసిన… వాటిల్లో ఎక్కడో ఒకచోట టమాటా వాడకుండా ఉండలేము. రోజుకు నాలుగు టమాటాలు తింటే కాన్సర్ ను దూరం చేయవచ్చట. అధిక రక్తపోటు, గుండెపోటు, కొలెస్ట్రాల్ వంటివి టమాటాలతో తగ్గించవచ్చు. అత్యంత ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆహారంలో టమాటా ముందు ఉంటుంది.
అరటిపండు:
తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని ఇచ్చే పండు అరటిపండు. మలబద్దకం నివారణకు ఇది మంచి మందు. అదే టైం లో విరేచనాలు అవుతున్నా కూడా అరటిపండు తింటే అరికట్టవచ్చు. ఇందులో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది.
వెల్లుల్లి:
ఇందులో కాన్సర్ ను కరిగించే కారకాలు ఉంటాయి. రోజు మూడు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు తింటే ఒంట్లో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదు ఉదర సంబంధ వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి.
క్యాబేజీ, క్యాలిఫ్లవర్, తోటకూర
ఇవి మంచి పోషకాలు కలిగిన శాకాహారం. ఎప్పుడైనా విరివిగా దొరుకుతూనే ఉంటాయి. తోటకూరలో ఉండే ఐరన్, కాల్షియం శరీరానికి ఎంతో అవసరం.
జామకాయలు:
వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే పీచు పదార్ధాలు షుగర్ ని తగ్గిస్తాయి.
నిమ్మకాయ:
శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందించడంలో నిమ్మకాయ ముందుంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
బచ్చలి కూర
శరీరం ఎక్కువగా ప్రోటీన్స్ ను సంగ్రహించాలంటే బచ్చలి కూరను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇందులో కాల్షియం, ఐరన్ ఎక్కువగా లభిస్తాయి.
Advertisement
కొత్తిమీర:
ఇది కేవలం గార్నిష్ కె కాదు సమృద్ధిగా ఐరన్ ను కూడా అందిస్తుంది. రక్తహీనత ఎక్కువగా ఉన్నవారు కొత్తిమీర తీసుకుంటే వారికి మంచిగా రక్తం పడుతుంది.
గుడ్లు:
ఇందులో కాలరీలు తక్కువ. ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఆమ్లాలు కూడా తక్కువగానే ఉంటాయి.
చెర్రీ పండ్లు, రాచ ఉసిరి కాయలు, జామకాయలు, బిక్కి, మేడిపండ్లు:
వీటిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. వీటిని కొద్దిగా తీసుకున్న ఎక్కువమొత్తంలో పోషకాలు లభిస్తాయి.
చిలగడ దుంప:
మానసిక చింత నుంచి ఇది విముక్తి కలిపిస్తుంది. ఇందులో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటుంది. కాన్సర్ పై పోరాటం చేయడంలో చిలగడ దుంప మంచిగా పనిచేస్తుంది.
రాగి జావా:
రాగి లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీన్ని రాగి సంకటిలా చేసుకోవచ్చు. లేదా రొట్టెల చేసుకోవచ్చు.
ముడిబియ్యం:
వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటిని ఎక్కువ తినకుండానే కడుపు నింపేస్తాయి. తక్కువ ఆహారంతోనే ఎక్కువ శక్తి లభిస్తుంది.
మొలకలు:
అన్నిరకాల మొలకలు శరీరానికి అవసరమైన ఖనిజాలను అందిస్తాయి. ఉదయం సమయంలో బ్రేక్ ఫాస్ట్ కి బదులు మొలకలను తీసుకోవచ్చు.
బీన్స్:
చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు, బీన్స్ వంటివి శరీరంలో చక్కర స్థాయిని సమతుల్యం చేస్తాయి. వీటిల్లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది.
ఎండుద్రాక్ష:
దీంతో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మలబద్ధకం సమస్యని ఎదుర్కోవడానికి ఎండుద్రాక్ష దోహదం చేస్తుంది. విటమిన్ ఏ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత సమస్యని తగ్గిస్తుంది.
బాదం పప్పు:
వీటిల్లో మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. క్యాలరీలు తక్కువ, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్న ఆహారాన్ని తీసుకుంటే సంతృప్తి కలుగుతుంది. ఇందులో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది.
ఆలివ్ నూనె, నీరు, కొబ్బరి:
పామాయిల్ కంటే వంటలలో కొబ్బరి నూనె, ఆలివ్ నూనె ను వాడడం ఎంతో మేలు చేస్తుంది. ఆలివ్ నూనెలో ఒమెగా-3,ఒమెగా 6ఫ్యాటీ యాసిడ్స్ దండిగా ఉంటాయి. ఇక కొబ్బరి కూడా ఎంతో అవసరం. ఇందులో అధికంగా ఉండే విటమిన్ ‘ఇ’ శరీరంలోని థైరాయిడ్ గ్రంధి పనితీరుని మెరుగుపరుస్తుంది. ఇక శరీరంలో ఏది పూర్తిగా అరగాలన్న, మన శరీరం పోషకాలను సంగ్రహించాలన్నా నీటి అవసరం తప్పకుండ ఉంటుంది.