Advertisement
సినిమాల బడ్జెట్ తో పాటు హీరో రెమ్యునరేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. రెమ్యూనరేషన్ + లాభాల్లో షేర్… ఇప్పుడు హీరోల ట్రెండ్ అలా నడుస్తుంది. తప్పు లేదులే, సినిమా మొత్తం వాళ్ల మీద డిపెండ్ అయినప్పుడు.. ఆ మాత్రం రెమ్యునరేషన్ ఇవ్వాలిగా మరి. వాళ్లకోసమే థియేటర్స్ కి ప్రేక్షకులు వెళుతున్నారు కాబట్టి ఈ రెమ్యూనరేషన్లు ఇవ్వడం కరెక్ట్. ఇది ఇలా ఉండగా అప్ కమింగ్ మూవీస్ లో మన టాలీవుడ్ హీరోలు రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటున్నారో ఓ లుక్ వేయండి.
Advertisement
Also Read: Pakka Commercial Review: పక్కా కమర్షియల్ రివ్యూ
1. ప్రభాస్ తన రాబోయే చిత్రాలు అయిన ప్రాజెక్ట్ కె, సాలార్ కు రూ. 100 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అలాగే సినిమా లాభం నుండి 10 శాతం షేర్ పొందుతున్నట్లు సమాచారం.
2. పుష్ప 2 మొత్తం బడ్జెట్ మొత్తం 400 కోట్ల రూపాయలు. ఇందులో అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్‌గా 100 కోట్ల రూపాయలను తీసుకుంటున్నట్లు సమాచారం.
Advertisement
3. శంకర్ సినిమాకి రామ్ చరణ్ 70 – 90 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడట.
4. త్రివిక్రమ్ సినిమా కోసం మహేష్ బాబు తన రెమ్యునరేషన్ గా 65-70 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
5. కొరటాల శివ ప్రాజెక్ట్ కోసం జూనియర్ ఎన్టీఆర్ 55 కోట్లు తీసుకుంటున్నాడట.
6. “వినోదయ సతం” తెలుగు రీమేక్ కోసం పవన్ కళ్యాణ్ 60 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.
7. జైలర్ సినిమాకు రజనీ 151 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడట.
8. వంశీ పైడిపల్లి సినిమాకు విజయ్ 80 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం.