Advertisement
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆయనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కు వెరైటీగా బర్త్డే గ్రీటింగ్స్ తెలిపిన ఎనిమిది వందల మంది విద్యార్థులు ఏం చేసారో తెలుసా..? ఆయనపై ఇంత అభిమానమా..? అసలు వారు ఏం చేశారో తెలిస్తే మీరు కూడా షాక్ అయిపోతారు. సక్సెస్ స్టోరీ తో పవన్ కళ్యాణ్ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా కుప్పంలో నోబెల్ స్కూల్ కి చెందిన ఎనిమిది వందల మంది విద్యార్థులు వినూత్నంగా బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు.
Advertisement
పవన్ ఫోటో ప్రతిబింబం వచ్చే విధంగా విద్యార్థులు సమూహారంగా ఏర్పడి పవన్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇంతలా అభిమానాన్ని చాటుకోవడం కేవలం పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రమే జరిగిందని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వస్తున్నాయి. చిన్నపిల్లల్లో సైతం పవన్ కళ్యాణ్ కి ఊహించని ఫాలోయింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అయితే పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా రాబోతున్నాయని సంగతి తెలిసిందే.
Advertisement
Also read:
ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాల నుండి టీజర్స్ పోస్టర్స్ రాబోతున్నాయి. పవన్ సినిమాల రిలీజ్ డేట్ లకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోల్లో పవన్ కళ్యాణ్ వేరు అని ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ వేరే లెవెల్ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన ప్రస్తుతం 60 కోట్ల రేంజ్ లో పారితోషకాన్ని అందుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ క్రేజ్ ను ఎంత మెచ్చుకున్న తక్కువేనని చెప్పొచ్చు.
తెలుగు సినిమా వార్తలు కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!





