Advertisement
Weekly Horoscope : వృత్తి వ్యాపారాలు చేసే వృషభ రాశి వారికి ఆర్థికంగా ఇది ఎంతో అనుకూల సమయం. మీన రాశి వారు ఉద్యోగం మారే విషయంలో మోసపోయే అవకాశం ఉంది. వీటి వివరాలతో పాటు అన్ని రాశుల వారిగా వార ఫలాలు ఎలా ఉన్నాయంటే!
Advertisement
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మద్యస్థముగా ఉన్నది. ఖర్చులు నియంత్రించడం మంచిది. జన్మ రాహువు, వాక్ స్థానము నందు కుజ గ్రహ సంచారం చేత గొడవలకు దూరంగా ఉండాలి. కుటుంబంలో చికాకులు, వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో సమస్యలు అధికముగా ఉండును. అయినప్పటికీ ప్రతి పనిని పట్టుదలతో పూర్తి చేయడానికి ప్రయత్నించెదరు.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. వృషభ రాశి వారికి జన్మ రాశి అందు కుజుని ప్రభావం చేత ఆరోగ్య విషయంలో, కుటుంబ వ్యవహారముల యందు చికాకులు ఏర్పడును. సుఖభోజన ప్రాప్తి కలుగును. శారీరక శ్రమ కొంత అధికముగా ఉండును.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ వారం అంతా అనుకూలంగా లేదు. అష్టమ శని ప్రభావం వలన ఆందోళన, ఇబ్బందులు కలుగును. వ్యాపారము ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. శుక్రుడు, బుధుడు అనుకూల స్థితి వలన కుటుంబ సౌఖ్యము, ధన లాభము కలుగును. వ్యయస్థానంలో కుజుని ప్రభావం చేత ఆవేశపూరిత నిర్ణయాలు, వృధా ఖర్చులు పెరుగును.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్నది. గురు, కుజ, రాహు గ్రహాల అనుకూల ప్రభావం చేత అలాగే శని అనుకూలత వలన మీకు అన్ని విధాలుగా ఈ వారం కలిసి వచ్చును. చేసే ప్రతి పని అనుకూలించును. ఉత్సాహంతో ముందుకు సాగేదరు. ఆర్థిక విషయాలు అనుకూలించును.
సింహరాశి
ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. గత కొంత సమయంతో పోల్చి చూసినట్లయితే ఈ వారం మెరుగైన ఫలితాలు కనబడుతున్నాయి. ద్వితీయ స్థానంలో రవి, బుధుల సంచారం వలన ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు నూతనంగా వ్యవహారాలు జరిపేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం మంచిది.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితం ఉన్నది. జన్మరాశి రవి సంచరించుట వల్ల ఒత్తిళ్లు అధికముగా ఉండును. శారీరక శ్రమ ఏర్పడును. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మనోధైర్యంతో ముందుకు వెళ్లి విజయము పొందెదరు. శని గురు గ్రహాల అనుకూల ప్రభావం చేత చేసే ప్రతి పనిలో విజయం పొందెదరు.
Advertisement
తులారాశి
తులా రాశి వారికి ఈ వారం అనుకూలంగా లేదు. శత్రువులతో జాగ్రత్త వహించాలి. కుటుంబ వ్యవహారాలు ఒత్తిడికి గురి అగును. జన్మరాశి అందు కేతువు, అష్టమ స్థానము నందు కుజుడు, శత్రు స్థానము నందు గురుని సంచారము వలన తులా రాశి వారికి ఉద్యోగమునందు ఉద్యోగస్తులకు రాజకీయ ఒత్తిడి, శత్రుత్వ భయము కలుగును. కుటుంబము నందు మానసిక ఒత్తిళ్లు ఇబ్బందులు ఏర్పడును.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఖర్చులు పెరుగును. ఆర్భాటాలకు దూరంగా ఉండటం మంచిది. శని అనుకూల ప్రభావం చేత పంచమ స్థానము గురువు, ఆరవ స్థానం రాహువు ప్రభావం చేత అనుకున్న ప్రతి పనిని పూర్తిచేసేదరు. సమాజమునందు కీర్తి, కుటుంబం నందు గౌరవము పెరుగును.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితములు ఉన్నవి. లాభ స్థానమునందు కేతువు, దశమ స్థానమునందు రవి, బుధులు భాగ్యం నందు శుక్రుని సంచారము వలన అనుకున్న ప్రతి పనిని పూర్తి చేసేదరు. కుటుంబము నందు సౌఖ్యము, కీర్తి కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయము.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం మద్యస్థముగా ఉన్నది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. జన్మ రాశి యందు శని వక్రీమై సంచరించుట వలన అలాగే తృతీయము నందు గురుని ప్రభావం చేత మానసిక ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును. నాలుగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ధనస్థానము నందు బృహస్పతి సంచారము వలన కుటుంబ వ్యవహారాలు, ఆర్థిక విషయాల యందు పురోగతి కనబడును. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. ధన వ్యయము ఆర్థిక సమస్యలు ఇబ్బంది పెట్టును. అప్పు చేసి ముందుకు వెళ్ళవలసినటువంటి గ్రహస్థితి. కోర్టు వ్యవహారాలు చికాకులు కలిగించును.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థముగా ఉన్నది. జన్మరాశి అందు గురుని ప్రభావం చేత మీన రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు అధికంగా ఉండును. మిగతా గ్రహముల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతి పని విజయవంతంగా పూర్తి చేసేదరు.
READ ALSO : పంచముఖ ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసా ?